టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా ‘గొర్రెపురాణం’ అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే ‘హనుమాన్’ చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం ‘మిరాయ్’ అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?