ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి బ్రా, స్కర్ట్ ధరించి ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెట్రోలో ఓ యువతి సీటులో బ్యాగు పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఆ తర్వాత ఆమె సీట్లోంచి లేవగానే అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ యువతి బికినీ స్టైల్‌లో బ్రా, మినిస్కర్ట్ వేసుకోవడం విశేషం. ఆ యువతి దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిపై మారణహోమం జరుగుతోందని విమర్శిస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో హల్ చేసిన యువతి పంజాబ్‌లోని ఫతేగర్‌కు చెందిన రిథమ్ చహానాగా తెలుస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. బోల్డ్ ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
గతేడాది అక్టోబర్ 9 వరకు ఇన్‌స్టాలో ట్రెడిషనల్ ఫొటోలనే రిథమ్ పెట్టింది. ఆ తర్వాత నుంచి అనూహ్యాంగా బోల్డ్ ఫొటోలను పెట్టడం ప్రారంభించింది. ‘తుఫాను వచ్చే ముందు ప్రశాంతత’ అంటూ తన తొలి హాట్ పోస్టుకు రిథమ్ క్యాప్షన్ పెట్టింది.
ఢిల్లీ మెట్రో ఘటనపై రిథమ్ చహానా స్పందించింది. ఎవరో చెప్తే తాను అలా చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను యాక్టింగ్ స్కూల్‌లో కోచింగ్ తీసుకుంటున్నట్లు చెప్పింది. సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకోవడం తన లక్ష్యమని రిథమ్ తెలిపింది.
ప్రస్తుతం రిథమ్ ఇన్‌స్టా ఖాతాను 5 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె తన ఖాతా క్యాప్షన్‌గా యాక్ట్రస్, మోడల్, వైరల్ మెట్రో గర్ల్ అని పెట్టుకోవడం విశేషం.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి