OG Movie: టిల్లు బ్యూటీతో పవన్‌ కల్యాణ్‌ రొమాన్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OG Movie: టిల్లు బ్యూటీతో పవన్‌ కల్యాణ్‌ రొమాన్స్!

    OG Movie: టిల్లు బ్యూటీతో పవన్‌ కల్యాణ్‌ రొమాన్స్!

    December 18, 2024

    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ‘ (OG) ఒకటి. యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా ‘ఓజీ’ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇందులో యంగ్‌ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    నేహాశెట్టి స్పెషల్ సాంగ్‌

    యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ‘డీజే టిల్లు’తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది. రాధిక అనే పాత్రతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘ఓజీ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌ చేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడే ఈ స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా మెుదలైనట్లు మూవీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్‌లో నేహా పర్‌ఫార్మెన్స్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్‌కు పక్కాగా విజువల్‌ ట్రీట్‌ ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. దీంతో ‘ఓజీ’పై అంచనాలు అభిమానుల్లో రెట్టింపయ్యాయని చెప్పవచ్చు. 

    ‘ఓజీ’తో బౌన్స్‌ బ్యాక్‌..!

    ‘డీజే టిల్లు’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో నేహా శెట్టికి తిరుగుండదని అంతా భావించారు. కానీ ఆ మూవీ సక్సెస్‌ హీరో సిద్ధు జొన్నగడ్డకు ఉపయోగపడినట్లుగా నేహాకు యూజ్‌ కాలేదు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడికి బడా చిత్రాల్లో అవకాశాలు రాలేదు. ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్‌’ వంటి చిన్న ప్రాజెక్ట్స్‌ చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్‌’లో గెస్ట్‌ రోల్‌, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మెప్పించినా తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ‘ఓజీ’లో స్పెషల్‌ సాంగ్‌తోనైనా నేహా బౌన్స్‌బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల ‘పుష్ప 2’లో ‘కిస్సిక్‌’ సాంగ్‌ చేసి శ్రీలీల వరుస అవకాశాలు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

    మోస్ట్ వాంటెడ్‌ మూవీగా ‘ఓజీ’

    పవన్‌ కల్యాణ్‌ చేతిలోని ‘హరి హర వీరమల్లు’, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కంటే ‘ఓజీ’ చాలా స్పెషల్‌ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్‌ యాక్టింగ్‌ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలానే జపనీస్‌ నటుడు కజుకి కిటముర కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరితో పాటు అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్తమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) వంటి వారు ఈ సినిమాలో నటిస్తుండటంతో ‘ఓజీ’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 

    ఓజీలో ప్రభాస్‌, అకీరానందన్?

    ఓజీ’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) కూడా ఓ క్యామియో ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మూవీ క్లైమాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అంతేకాదు సుజీత్‌ – ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సాహో’ చిత్రంతో ఓజీకి లింక్‌ కూడా ఉండనున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్‌ తనయుడు అకీరా నందన్‌ కూడా ‘ఓజీ’లో నటించినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపించింది. పవన్‌ చిన్నప్పటి పాత్రలో అకీరా నటించాడని, స్క్రీన్‌పై అతడి రోల్‌ చూసి అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారంటూ కూడా నెట్టింట పోస్టులు కనిపించాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version