Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్‌ రద్దుకు రంగం సిద్ధం?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్‌ రద్దుకు రంగం సిద్ధం?

    Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్‌ రద్దుకు రంగం సిద్ధం?

    December 17, 2024

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాజకీయ విమర్శలకు సైతం దారి తీసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో బన్నీ ఆ మర్నాడే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో సినీ ప్రముఖులంతా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ మరోమారు జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన బెయిల్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

    సుప్రీంకోర్టులో పిటిషన్‌..

    సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ బెయిల్‌ను రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు తెలుస్తోంది. బెయిల్‌ను సవాల్‌ చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. తొక్కిసలాట ఘటనలో అసలు బన్నీ తప్పేలేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్‌, పుష్ప 2 టీమ్‌ రాకకు పోలీసులు అనుమతి ఇవ్వలేదనేలా సోమవారం ఓ రిపోర్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసి బెయిల్‌ రద్దుకు పట్టుబట్టాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని బలమైన ఆధారాలు సేకరించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    బెయిల్‌ రద్దు కానుందా?

    పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నారని, ఇందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను కోరింది. అయితే హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు చేప్పినా వినకుండా వచ్చి, అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ హైకోర్టులోనూ వాదించారు. ఇదే వాదనతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పట్టుబట్టనున్నారు. వారి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే బెయిల్‌ రద్దై బన్నీ మళ్లీ చంచల్‌ గూడా జైలుకు వెళ్లే అవకాశముంది.

    ‘ఇదొక గుణపాఠం కావాలి’

    సంథ్యా థియేటర్‌ తొక్కిసలాట, అల్లు అర్జున్‌ అరెస్టుపై కన్నడ స్టార్‌ నటుడు కిచ్చా సుదీప్‌ తొలిసారి స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఎవరైనా సినిమా థియేటర్‌కు ఎంజాయ్ చేయడానికే వెళ్తారు. ఇలాంటి ఓ ఘటన జరగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవ్వరూ ఆశించరు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరు? ఎవర్ని శిక్షించాలి? అనేది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడే దానికి అనుగుణంగా చట్టాలు మారుతూ వస్తుంటాయి. ఇకపై ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలి. ఇదొక గుణపాఠం కావాలి. నెక్ట్స్ టైం ఎవరైనా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరిశీలించుకోవాలి’ అంటూ కిచ్చా సుదీప్ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version