తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 విజేత (Bigg Boss Telugu 8 Winner)గా కన్నడ నటుడు నిఖిల్ (Nikhil Maliyakkal) నిలిచాడు. తనకు గట్టి పోటీ ఇచ్చిన గౌతమ్ (Gautham P. Krishna)ను వెనక్కి నెట్టి ఆదివారం (డిసెంబర్ 15) రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతీ కారును గెలుచుకున్నాడు. 105 రోజుల పాటు కొనసాగిన ఈ రియాలిటీ షోలో నిఖిల్‌కు గౌతమ్ గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అతడు ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఓ దశలో అతడే విజేత అన్న అభిప్రాయాన్ని అందరిలో కలిగించాడు. తెలుగు వ్యక్తినే విజేతగా నిలపాలని అతడికి అనుకూలంగా కంపైయిన్ కూడా నడిచింది. ఈ క్రమంలో నిఖిల్ విజేతగా నిలవడం నెట్టింట తీవ్ర చర్చను లేవనెత్తింది. నిఖిల్ కుట్రపూరితంగా గెలిచారని పలువురు ఆరోపిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్, స్టార్‌మా వర్గాలు కావాలనే గౌతమ్‌ను ఓడించాయని ఆరోపిస్తున్నారు.
ఆ పోలింగ్స్‌లో గౌతమ్ టాప్!
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి ముందు వరకూ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu 8 Winner)లో నిఖిల్ తిరుగులేని కంటెస్టెంట్‌గా కొనసాగుతూ వచ్చాడు. అప్పటివరకూ వార్ వన్ సైడ్ అన్నట్లు సాగిన నిఖిల్ దూకుడుకు వైల్డ్‌కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ బ్రేకులు వేశాడు. నిఖిల్ తప్పొప్పులను నిర్భయంగా బయటపెడుతూ తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. ఓ దశలో నిఖిల్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంపెయిన్ సైతం సోషల్ మీడియాలో నడిచింది. మన తెలుగు వ్యక్తిని బిగ్‌బాస్ విజేతగా నిలుపుదామంటూ బిగ్‌బాస్ లవర్స్ పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. పలు యూట్యూబ్ ఛానళ్లు నిర్వహించిన అన్ అఫిషియల్ పోలింగ్‌లో గౌతమ్ టాప్‌లో నిలిచాడు. దీంతో అతడి విజయం లాంఛనమే అని గౌతమ్ ఫ్యాన్స్ భావించారు. అయితే అఫిషియల్ ఓటింగ్‌లో నిఖిల్ టాప్‌లో ఉన్నాడని హోస్ట్ నాగార్జున ప్రకటించి అతడికి ట్రోఫీ అందజేశాడు.
విన్నర్ ఎంపికలో కుట్ర జరిగిందా?
విజేత నిఖిల్.. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. స్టార్‌మాలో వచ్చిన ‘గోరింటాకు’, ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ సీరియల్స్‌తోపాటు ‘కిర్రాక్ బాయ్స్’, ‘ఖిలాడీ గర్ల్స్’ వంటి రియాలిటీ షోలలో అలరించాడు. దీంతో స్టార్‌మాలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో అతడికి అవకాశం దక్కింది. అయితే రన్నరప్ గౌతమ్‌తో పోలిస్తే స్టార్‌మా వర్గాలతో నిఖిల్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. గ్రూప్ గేమర్, సేఫ్ గేమర్ అంటూ అతడిపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఓటింగ్ పరంగా అతడిపై ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడలేదు. సోషల్ మీడియాలో సైతం నెగిటివ్ వార్తలు ప్రచారమైనా అతడి గ్రాఫ్ తగ్గకపోవడం గౌతమ్ ఫ్యాన్స్‌లో అనుమానాలకు కారణమైంది. బిగ్‌బాస్, స్టార్‌మా టీమ్ నిఖిల్‌కు అండగా నిలుస్తున్నారని, ఓట్లు తక్కువ వచ్చినా కూడా అతడ్ని కాపాడుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు సైతం చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్ విజేతగా ప్రకటిండంతో గౌతమ్ ఫ్యాన్స్ కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
రన్నరప్‌గా నిలిచి కొద్దిలో ట్రోఫీ చేజార్చుకున్న గౌతమ్ కృష్ణ (Bigg Boss Telugu 8 Winner)కు ఆయన ఫ్యాన్స్ నెట్టింట అండగా నిలుస్తున్నారు. నిఖిల్ కప్ గెలిస్తే.. గౌతమ్ హృదయాలను గెలుచుకున్నాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఒక వ్యక్తి వైపుకి ఏకపక్షంగా సాగుతున్న సీజన్‌ను అద్భుతమైన ఫైట్‌తో ఇంట్రస్టింగ్‌గా షోను మార్చాడని ప్రశంసిస్తున్నారు. సీజన్ 8కి ‘గేమ్ ఛేంజర్’లా మారావని ప్రశంసిస్తున్నారు. గౌతమ్ (Gautham P. Krishna) రియల్ విజేత అంటూ పోస్టులు పెడుతున్నారు. వన్ వర్సెస్ మెనీ అంటూ అనాలిసిస్ పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్ రన్నరప్ వార్త తెలిసిన వెంటనే అతడి ఫ్యాన్స్ ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళనకు దిగారు. తెలుగు వ్యక్తికి అన్యాయం చేస్తున్నారంటూ బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు.
గౌతమ్ సంపాదన ఎంతంటే?
బిగ్‌బాస్ విజేతగా నిలిచిన నిఖిల్ (Nikhil Maliyakkal)కు పెద్ద మెుత్తంలో ప్రైజ్ మనీ లభించిన సంగతి తెలిసిందే. మరి రన్నరప్‌గా నిలిచిన గౌతమ్ (Gautham P. Krishna)కు ఏం దక్కిందని అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి గత సీజన్‌లోనే గౌతమ్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫైనల్ చేరలేదు. ఈ సారి టాప్ 2లో నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే వారానికి రూ.1.75 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకునేలా బిగ్‌బాస్ టీమ్‌తో గౌతమ్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెుత్తం పది వారాల పాటు హౌస్‌లో కొనసాగినందున అతడికి పారితోషికం రూపేణా దాదాపు రూ.రూ.17,50,000 అందనున్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్