టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ సైతం విధించింది.
ఏం జరిగిందంటే?
సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్ (Prasad Behera Arrest)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ప్రసాద్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. షూటింగ్ టైమ్‌లో తన ప్రైవేటు భాగాలను తాకాడని ఆరోపించింది. ఈ క్రమంలో గట్టిగా నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత కూడా పదే పదే తప్పుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘తిడుతూ దాడి కూడా చేశాడు’
కొద్ది రోజుల తర్వాత మరో వెబ్‌సిరీస్‌లో కలిసి పనిచేసినప్పుడు కూడా మరోమారు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని ప్రశ్నించగా అందరిముందు దూషించాడని చెప్పింది. డిసెంబర్ 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి కూడా చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్‌పై 75(2), 79, 351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ప్రసాద్ ఎలా ఫేమస్ అంటే?
‘మా విడాకులు’, ‘పెళ్లి వారమండి’, ‘దిల్ పసంద్’, ‘వింధ్యా విహారి’ వంటి యూట్యూబ్ కామెడీ సిరీస్‌లతో ప్రసాద్ బెహరా మంచి గుర్తింపు సంపాదించాడు. అతడి కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో చిన్నగా సినిమా అవకాశాలు సైతం అతడ్ని వరించాయి. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) మూవీలో ప్రసాద్ మంచి రోల్ పోషించాడు. తనలో కమెడియన్‌తో పాటు మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు.
కెరీర్ ముగిసినట్లేనా?
కమిటీ కుర్రోళ్లు సక్సెస్‌తో ప్రసాద్ బెహారాకు టాలీవుడ్‌లో అవకాశాలు మెుదలయ్యాయి. ఈ క్రమంలో అతడు అరెస్టు కావడం ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి. అది కూడా యువతిని లైంగికంగా వేధించిన కేసులో జైలుకు వెళ్లడం తీవ్ర చర్చకు తావిస్తోంది. క్రమశిక్షణ, మంచి ప్రవర్తన లేని వ్యక్తులకు అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తుంటాం. తాజా అరెస్టు నేపథ్యంలో సినిమాల్లోకి ప్రసాద్‌ను తీసుకోవడం కష్టమేనని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా కేసులో దోషి అని తేలితే ఇండస్ట్రీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలక మానదని అంటున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి