రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
‘దోప్’ సాంగ్ విశేషాలు
సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. కియరా, రామ్ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది.
కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు.
సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’
‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి.
టీజర్‌కు మంచి స్పందన
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి