Affordable Vacuum Cleaners: బడ్జెట్‌ ఫ్రెండ్లీ వాక్యూమ్‌ క్లీనర్లు.. పేదవారు కూడా దర్జాగా వినియోగించవచ్చు! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Affordable Vacuum Cleaners: బడ్జెట్‌ ఫ్రెండ్లీ వాక్యూమ్‌ క్లీనర్లు.. పేదవారు కూడా దర్జాగా వినియోగించవచ్చు! 

    Affordable Vacuum Cleaners: బడ్జెట్‌ ఫ్రెండ్లీ వాక్యూమ్‌ క్లీనర్లు.. పేదవారు కూడా దర్జాగా వినియోగించవచ్చు! 

    October 8, 2023

    ఇంటి పరిశుభ్రత విషయంలో వాక్యూమ్‌ క్లీనర్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గృహిణుల శ్రమను అమాంతం తగ్గించేస్తాయి. అయితే చాలా మంది ఈ వాక్యూమ్‌ క్లీనర్లు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయని భావిస్తుంటారు. అది నిజం కాదు. తక్కువ బడ్జెట్‌లోనూ మంచి వాక్యూమ్‌ క్లీనర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని కొనేందుకు ఎలాంటి అప్పు చేయాల్సిన అవసరం లేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి భారం అనుకోకుండా ఈ ‘Affordable Vacuum Cleaners’ ఎంచక్కా కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్‌ వాక్యూమ్‌ క్లీనర్ల జాబితాను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.

    KENT Zoom Cordless Vacuum Cleaner

    తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమమైన కార్డ్‌లెస్‌ వాక్యుమ్‌ క్లీనర్‌ కోరుకునేవారు KENT Zoom Cordless Vacuum Cleaner ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.14,999 కాగా అమెజాన్‌ దీనిపై 53% డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా దీనిని రూ.6,999కే దక్కించుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్‌ 30 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. హార్డ్‌ ఫ్లోర్‌, కార్పెట్‌ ఫ్లోర్‌పై దీన్ని వినియోగించవచ్చు.

    Philips PowerPro  Bagless Vacuum Cleaner

    గృహోపకరణ వస్తువులను అందించే ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో పిలిప్స్‌ ఒకటి. ఈ కంపెనీ తీసుకొచ్చిన Philips PowerPro వాక్యూమ్‌ క్లీనర్‌కు మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉంది. దీనిని పవర్‌ సైక్లోన్‌ 5 టెక్నాలజీతో తీసుకొచ్చారు. 370 Watts పవర్‌, 1.5 litres సామర్థ్యాన్ని అందించారు. తక్కువ బరువునే కలిగి ఉండటం వల్ల మహిళలు ఈ వాక్యూమ్‌ క్లీనర్‌ను తేలిగ్గా వినియోగించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.9,199కే లభిస్తోంది. 

    Oraimo Stick Vacuum Cleaner

    రూ.7 వేలలోపు బెస్ట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ కోసం వెతుకున్నవారు Oraimo Stick Vacuum Cleanerను పరిశీలించవచ్చు. ఇది 15-35 నిమిషాల రన్‌ టైమ్‌ను కలిగి ఉంది. ఈ కార్డ్‌లెస్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ కేవలం ఫ్లోర్‌నే కాకుండా సోఫాసెట్స్‌, కుర్చీ, ఫర్నీచర్‌ను కూడా శుభ్రం చేస్తుంది. గోడ మీద ఉన్న బూజును సైతం చిటికెలో తొలిగంచేస్తుంది. దీని అసలు ధర రూ.13,999. కానీ అమెజాన్‌ దీనిపై 53% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఈ వాక్యూమ్‌ క్లీనర్‌ రూ. 6,599కే అందుబాటులోకి వచ్చింది. 

    Agaro Regal Plus Upright

    ఇక రూ.2 వేలలో కూడా మంచి వాక్యూమ్‌ క్లీనర్‌ అందుబాటులో ఉంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్న ఇంటికి ఈ వాక్యూమ్‌ క్లీనర్‌ సరిగ్గా సరిపోతుంది. ఇది ఫ్లోర్‌తో పాటు సోఫాలు, చెక్క బల్లలు క్లీన్‌ చేస్తుంది. పెంపుడు జంతువుల హెయిర్‌ను కూడా నిమిషాల్లో శుభ్రం చేస్తుంది. దీని అసలు ధర రూ.2,999. కానీ అమెజాన్‌ దీనిపై 33% డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా దీన్ని రూ.1,999 పొందవచ్చు.

    AGARO Regal 800 Watts

    గోడలు, సోఫా సెట్లు, కబోర్డ్స్‌ పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా AGARO Regal 800 Watts వాక్యూమ్‌ క్లీనర్‌ అందుబాటులో ఉంది. దీనిని చాలా తేలిగ్గా ఆపరేట్‌ చేయవచ్చు. ఇంటి మూలల్లో ఉన్న దుమ్ము, దూళిని కూడా ఇది తొలగిస్తుంది. దీనిలో మల్టిపుల్‌ క్లీనింగ్‌ బ్రష్‌లు ఉన్నాయి. అయితే ఇది పొడి చెత్తను మాత్రమే కలెక్ట్‌ చేస్తుంది. ఈ వాక్యూమ్‌ క్లీనర్‌ అసలు ధర రూ.2,099. అమెజాన్‌లో ఇది రూ. 1,599 లభిస్తోంది.

    Eureka Forbes Supervac Vacuum Cleaner 

    తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ వాక్యూమ్‌ క్లీనర్‌ను కోరుకునే వారు Eureka Forbes Supervac ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 5,501కే అందుబాటులో ఉంది. ఇందులో పవర్‌ కంట్రోల్‌ ఆప్షన్స్‌ కూడా ఉన్నాయి. మిషన్‌ కలెక్ట్‌ చేసిన డస్ట్‌ను చేతితో క్లీన్‌ చేసే పనిలేకుండా బటన్‌ నొక్కి తొలగించే వెసులుబాటు ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version