Allu Arjun: సీఎం రేవంత్‌ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: సీఎం రేవంత్‌ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!

    Allu Arjun: సీఎం రేవంత్‌ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!

    December 21, 2024
    allu arjun comments

    allu arjun comments

    ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. ఈ మేరకు ప్రేస్‌ మీట్ పెట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు.. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి.. మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.. నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు.

    థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు.. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయాను.. రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది.. నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదు.. తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారు.

    Screengrab Instagram:alluarjun

    సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా.

    సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్.. ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version