Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?

    Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?

    December 24, 2024

    సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ‘పుష్ప 2’ హీరో అల్లు అర్జున్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్‌ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్‌ ఇంటి నుంచి బన్నీ బయలుదేరారు. అతడితో పాటు తండ్రి అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్‌ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉ.11 గంటలకు అల్లు అర్జున్‌ విచారణ మెుదలైంది. ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు.

    అల్లు అర్జున్ ఎమోషనల్‌..

    పోలీసుల విచారణ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపించిన వీడియో చూసి ఆయన ఎమోషనల్‌ అయినట్లు సమాచారం. తన వల్ల కొన్ని పొరపాటులు జరిగాయని పోలీసులతో అల్లు అర్జున్‌ అన్నట్లు తెలుస్తోంది. మెుత్తం 3 గంటల 35 నిమిషాల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించగా.. కొన్ని ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని బన్నీ చెప్పారు. మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

    అల్లు విచారణ పూర్తి

    అంతకుముందు అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. తొక్కిససలాటకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన 10నిమిషాల వీడియోను చూపించి కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బన్నీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అనంతరం అతడ్ని విడిపెట్టినట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్‌ను పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టారు. 

    ఆ ప్రశ్నలకు బన్నీ మౌనం..!

    చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. ‘తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా’ అని పోలీసులు ప్రశ్నించగా అల్లు అర్జున్‌ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించగా ఈ క్వశ్చన్‌కు కూడా బన్నీ సైలెంట్‌గానే ఉన్నారని సమాచారం. 

    బన్నీ కోసం 50 ప్రశ్నలు!

    సంధ్యా థియేటర్‌ ఘటనకు సంబంధించి మెుత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్‌ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలను బన్నీకి సంధించినట్లు తెలిసింది. దీనిపై బన్నీ ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్స్‌ ప్రకారం బన్నీ ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. 

    బన్నీని అడిగిన ప్రధాన ప్రశ్నలు ఇవే!

    తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ కోసం 50 ప్రశ్నలను చిక్కడపల్లి పోలీసులు రెడీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి. 

    1. సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు ఎవరి అనుమతి తీసుకున్నారు?

    2. పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు?

    3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఉందా? లేదా?

    4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?

    5. రేవతి మరణం గురించి ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు?

    6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?

    7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?

    8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?

    9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?

    10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?

    11. అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?

    12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?

    13. పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు?

    14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version