పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకోగా అతను కూడా కొద్ది నెలలకే అధికార వైకాపా ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో పవన్‌ను టార్గెట్ చేస్తూ వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం పవన్ దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున పవన్‌పై టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పవన్‌ను ట్రోల్ చేస్తూ ఏకంగా సినిమా కూాడా తీశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-భాజపా) అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పవన్‌ను ఎంతగానో విమర్శించిన ఆర్జీవీ, పోసానిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఆర్జీవీపై వరుస కేసులు
సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఇవాళ (నవంబర్ 11) ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ (Nara Lokesh), బ్రాహ్మణి (Nara Brahmani), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్జీవీపై గుంటూరు జిల్లా తాళ్లురు పోలీసు స్టేషన్‌లోనూ కేసు పెట్టారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
త్వరలో పోసాని అరెస్టు!
పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. వైసీపీ స్థాపన తరువాత జగన్ పంచకు చేరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. జగన్ సీఎం అయ్యాక వైసీపీ నేతల కంటే మరింత ఘాటుగా పవన్, చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్‌పై పలు ప్రెస్‌మీట్లలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పవనో మెంటల్ కేసని, పైసల కోసమే మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టిందని గతంలో పోసాని మండిపడ్డారు. మట్టిగొట్టుకుపోతావ్ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గతంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమోచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను తిరగదోడుతుండటంతో ఓ క్షణమైన పోసాని అరెస్టు కావొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వైసీపీ మద్దతుదారులనేదీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కల్యాణ్ తల్లిని సైతం ఆమె దూషించిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వారిపై ఏపీ పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో శ్రీరెడ్డిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై తన మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టనని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.
ప్రకాష్ రాజ్‌పై చర్యలుంటాయా?
ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ప్రకాష్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సందించారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్‌ట్యాగ్‌తో పవన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయంలో దూరి మరి విమర్శలు చేయడంపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌పైనా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత కేసులనే ఏపీ పోలీసులు తిరగదోడుతున్నారు. పైగా ప్రకాష్ రాజ్‌పై ఏ స్టేషన్‌లోనూ కేసు నమోదు కానందున ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ