Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు

    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు

    April 3, 2023

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ సినిమా రిలీజ్‌ అంటే థియేటర్స్‌ దగ్గర పూనకాలే. బన్నీకి బయటనే గాక సోషల్‌ మీడియాలోనూ భారీగా క్రేజ్‌ ఉంది. ఇవాళ బన్నీ గారాల పట్టి అల్లు అయాన్‌ పుట్టిన రోజు కావడంతో నెటిజన్లు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘అల్లు అయాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ తమదైన శైలిలో బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. దీంతో ట్విటర్‌లో #AlluAyan పేరు ట్రెండింగ్‌గా మారింది. 

    అయాన్‌ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే మై స్వీటెస్ట్‌ ‘చిన్నిబాబు’ అంటూ అయాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టును బన్నీ ప్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. 

    అటు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా అయాన్‌కు బెస్ట్ విషెస్‌ చెబుతున్నారు. ‘చెర్రీ మామ’ అంటూ అయన్‌ ముద్దుగా పిలిచిన వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేగాక రంగస్థలంలో చరణ్‌ ఫోజును అనుసరిస్తూ అయాన్‌ దిగిన ఫొటోను పంచుకుంటున్నారు. నటుడిగా తనకు రామ్‌చరణ్‌ ఇష్టమని ఓ సందర్భంలో అయాన్ చెప్పడం గమనార్హం. 

    సైరా ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా అయాన్‌పై అల్లుఅర్జున్‌ ప్రేమ చూపించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్‌ తెగ వైరల్ చేస్తున్నారు. అమితంగా ప్రేమించే బన్నీ లాంటి నాన్న దొరికినందుకు అయాన్ అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు. 

    బన్నీ చిన్నప్పుడు అయాన్‌ను ఎత్తుకున్న ఫొటోలను ఫ్యాన్స్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అలాగే అల్లు అర్హాతో అయాన్‌ దిగిన పిక్‌ను వైరల్ చేస్తున్నారు. 

    డీజే టిల్లు ఆడియో ఫంక్షన్‌ వేదికపై అయాన్‌ నమస్కరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న అయాన్‌ను చూసి బన్నీ మురిసిపోవడం వీడియోలో కనిపిస్తోంది. 

    అల్లు అర్జున్‌తో కలిసి అయాన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో దూకే వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. 

    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ఘనీ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అప్పట్లో  అల్లు అయాన్ చేసిన వీడియో ఇప్పడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తూ అయాన్ కనిపిస్తాడు. 

    అల్లు అరవింద్‌ శతజయంతి వేడుకల్లో అయాన్‌ తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు

      మెుత్తంగా అల్లుఅర్జున్‌కు సరైన వారసుడు అయాన్‌ అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జూనియర్‌ అల్లుఅర్జున్‌ అంటూ ఇప్పటినుంచే ఆకాశానికి ఎత్తుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version