అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి.. తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచిన ధీరుడు

© File Photo

నేడు స్వ‌తంత్ర పోరాట యోదుడు, మ‌న్యం దొర అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి. 1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జ‌న్మించారు. సాయ‌ద పోరాటం ద్వారానే స్వ‌తంత్రం తెచ్చుకోగ‌ల‌మ‌ని న‌మ్మి బ్రిటీష్‌వాళ్ల‌ను ఎదిరించ‌చిన యోదుడు అల్లూరి. మ‌న్యం వాసుల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి పోలీసుల పెడుతున్న హింస‌ల నుంచి వారిని కాపాడేందుకు పోలీస్ స్టేష‌న్ల‌పై దాడి చేసి ఆయుధాల‌ను చేజిక్కించుకున్నాడు. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలిచి, వారి హ‌క్కుల‌ గురించి వివ‌రించి వారిలో ధైర్యాన్ని నింపి అన్యాయాల‌ను ఎదురించే యోధులుగా త‌యారుచేశాడు. ఏప్రిల్ 7, 1924న‌ మ‌న్యం ప్రాంతానికి క‌లెక్ట‌ర్‌గా వ‌చ్చిన రూథ‌ర్‌ఫ‌ర్ట్ అల్లూరి సీతారామ‌రాజు జాడ చెప్పాల‌ని అక్క‌డ ప్ర‌జ‌ల‌ను హింసించ‌సాగాడు. దీంతో తానే లొంగిపోతాన‌ని అల్లూరి క‌బురు పంపాడు. దీంతో అత‌డిని బందించి మేయ‌ర్ గుడాల్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. బందీలో ఉన్న అల్లూరి ఒక చెట్టు క‌ట్లేసి గుడాల్ కాల్చి చంపేశాడు. ఈ విధంగా 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

Exit mobile version