Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

    Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

    October 19, 2024

    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె నటించి పొట్టేల్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనన్య నాగళ్ల హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా అనన్యకు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె ఇచ్చిన అదిరిపోయే సమాధానం నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    అసలేం జరిగిందంటే?

    అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా పొట్టేల్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. ‘ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్‌ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్‌ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు’ అని ప్రశ్నించింది. ‘ఇది వందశాతం రాంగ్‌ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్‌ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు’ అని అనన్య పేర్కొంది. 

    నెగిటివ్‌ వైపే చూస్తున్నారు: అనన్య

    మనిషి జీవితంలో లాగానే ఇండస్ట్రీలో కూడా నెగిటివ్‌, పాజిటివ్‌ అనే రెండు అంశాలు ఉంటాయని అనన్య అన్నారు. మీరు ఎక్కువగా నెగిటివ్‌ వైపే చూస్తున్నరంటూ రిపోర్టర్‌కు చురకలు అంటించారు. ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చే ముందు కమిట్‌మెంట్‌ ఉంటుందనేది బుల్‌ షిట్‌ వ్యవహారమంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక రేటు (రెమ్యూనరేష్‌), ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందని ఇండస్ట్రీ వాళ్లే చెబుతుంటారు’ అని అన్నారు. అప్పుడు అనన్య బదులిస్తూ ‘మీరు ఎలాంటి ఎక్స్‌పిరియన్స్‌ లేకుండా విన్నమాట చెబుతున్నారు. కానీ నేను ఎక్స్‌పీరియన్స్‌ చేసి చెబుతున్నా. కమిట్‌మెంట్‌ ఇక్కడ లేదు’ అంటూ ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

    రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్‌

    అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్‌ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్‌ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్‌ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్‌ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్‌ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్‌ చేశారు. మహిళా రిపోర్టర్‌ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్‌ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

    ఫ్లైట్‌లో అనన్య ప్రమోషన్స్‌

    పొట్టేల్‌’ చిత్రంలో చంద్ర కృష్ణ, అనన్య జంటగా నటించారు. ఈ నెల 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నటి అనన్య నాగళ్ల విమానంలో చిత్ర ప్రమోషన్స్‌ చేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మూవీ పోస్టర్లు, కరపత్రాలు పంచి పెట్టింది. తమ సినిమాను చూసి ఆదరించాలని కోరింది. అనన్యతో పాటు ‘పొట్టేల్‌’ టీమ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొత్త తరహా ప్రమోషన్స్‌కు అనన్య నాంది పలికారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version