Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!

    Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!

    May 1, 2024

    తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్‌ లవర్‌ అయిన రష్మి.. సోషల్‌ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 

    ఘాటు కొటేషన్‌..!

    యాంకర్‌ రష్మి.. ఓ వైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలు, జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తిక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌ రాసిన ఈ కొటేషన్‌ను రష్మి పంచుకుంది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన ప్రస్తావన ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కొటేషన్‌లో ‘మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్‌ కాదు’ అని రాసి ఉంది. 

    కొటేషన్‌కు మూలం ఇదే

    ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌.. ఈ కొటేషన్‌ను ఓ వేశ్య నుంచి తీసుకున్నారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలంటూ దానిని కొటేషన్‌ రూపంలో పేర్కొన్నారు. రష్మి పెట్టిన ఈ పోస్టును అంతర్లీనంగా పరిశీలిస్తే పెద్ద అర్థమే అందులో దాగుంది. ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు.. దాని మనుగడ అసలే ఉండదు’ అన‌్నది రష్మిక పోస్టు వెనుక దాగున్న ఉద్దేశం. అయితే రష్మిక లేటెస్ట్ పోస్టు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వ్యభిచారానికి సంబంధించి పోస్టు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రష్మి ఫ్యాన్స్‌ మాత్రం ఆమె పనిని సమర్థిస్తున్నారు. 

    గతంలోనూ ఇలాగే..

    దేశంలో బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై గతంలో రష్మిక ఇలాగే ఘాటుగానే స్పందించింది. సె** పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొందరు రష్మి మాటలను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు. 

    రష్మి సినిమా కెరీర్‌..

    హోలీ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మీ గౌతమ్‌.. థ్యాంక్స్‌, కరెంట్‌, ఎవరైనా ఎప్పుడైనా, వెల్‌ డన్‌ అబ్బా, బిందాస్‌, చలాకి, ప్రస్తానం తదితర చిత్రాల్లో నటించింది. ‘జబర్దస్త్‌’లో యాంకర్‌గా చేరినప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మి చేసింది. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది చిరంజీవి ‘భోళాశంకర్‌’ సినిమాలోనూ యాంకర్‌ రష్మి మెరిసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version