ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ చలమలశెట్టి (Anil Chalamalasetty) తన 50వ పుట్టిన రోజు వేడుకలను ఇటీవల మాల్దీవుల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, అక్కినేని అఖిల్ హాజరుకావడంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. అంతమంది సెలబ్రిటీలు హాజరయ్యేంతగా ఆయనలో ఏముందని గూగుల్‌లో ఆయన గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం.
పట్టుదల కృషి ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైన ఎదగవచ్చని నిరూపించిన వ్యాపారవేత్తల్లో అనిల్ చలమలశెట్టి ఒకరు.
ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఆయన (Anil Chalamalasetty) గ్రీన్‌కో అనే కంపెనీని స్థాపించి ప్రపంచ కార్పోరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
యూకేలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన ఆయన నాలుగు సంవత్సరాల పాటు ఐటీ రంగంలో ప్రతిభ కనబరిచారు.
తానే ఒక సైన్యంగా మారి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించాలని అనిల్ చలమలశెట్టి నిర్ణయించుకున్నారు.
అయితే తన మేదస్సు, శక్తి సామర్థ్యాలు పరాయి దేశానికి ఉపయోగపడకోదని భావించిన ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడే ‘గ్రీన్‌కో’ (Greenko) అనే కార్పోరేట్ సంస్థకు అంకురార్పణ చేశారు.
దాని ద్వారా ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఎన్విరాల్‌మెంట్ సెక్టార్స్‌లో విజయ కేతనం ఎగురవేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని క్లీన్ ఎనర్జీ సంస్థగా గ్రీన్‌కోను ప్రపంచ పటంలో నిలబెట్టారు.
గ్రీన్‌కో సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు దేవుడిగా మారారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వారి అభిమానాన్ని చురగొంటున్నారు.
10 వేల మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ దేశంలోని 15 రాష్ట్రాలకు పైగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
అనిల్ చలమలశెట్టి (Anil Chalamalasetty)కి సేవా భావం కూడా ఎక్కువే. ప్రకృతి వైపరిత్యాలు, కరోనా కష్టకాలంలో తాను ఉన్నానంటూ కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
గొప్ప వ్యాపారవేత్తగా, మానవతావాదిగా గుర్తింపు పొందిన ఆయనకు సౌత్ ఇండియా ఉత్తమ బిజినెస్ మెన్ అవార్డును సైతం వరించింది
గతేడాది ఏపీలోని జే.ఎన్.టీ.యూ కాకినాడ యూనివర్సిటీ ఈ వ్యాపారవేత్త సేవలకు గాను గౌరవ డాక్టరేట్ బహుకరించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ డాక్టరేట్‌ను అందించారు.
అనిల్ చలమలశెట్టి (Anil Chalamalasetty)కి వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయ, సినిమా ఇండస్టీలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన్ను వ్యక్తిగతంగా చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, మహేష్ బాబు ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.