• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఈడీ ఎదుట నవదీప్ హాజరు

    హైదరాబాద్‌- నేడు ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. మధాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు పరిచయాలు ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. వీరితో జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

    సిట్ ఆఫీస్‌కు నారా లోకేష్

    కాసేపట్లో సిట్ ఆఫీసుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను విచారించనున్నారు. ఐఆర్‌ఆర్‌ కేసులో ఏ-14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. మంత్రిగా లోకేష్ ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

    మూడోసారి కేసీఆరే సీఎం: ఓవైసీ

    తెలంగాణలో మూడో సారి కేసీఆర్ సీఎం అవుతారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా MIM పోటీ చేసే స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు, పోటీ చేయని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముస్లింలకు సూచించారు.

    నేడు ఆదిలాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

    నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌లోని 7 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. సుమారు లక్షమందిని సభకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలు సభకు హాజరుకానున్నారు.

    లెఫ్ట్ పార్టీలతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో పొత్తు కుదిరింది. సీపీఐకి రెండు స్థానాలు, సీపీఎంకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కేటాయించగా.. సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు ఖరారు చేసింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు సీపీఐ, సీపీఎం సపోర్ట్‌ చేసినప్పటికీ… అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో దోస్తీకి కేసీఆర్ ముఖం చాటేశారు.

    శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,828 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 28 వేలమంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. సోమవారం తిరుమలేషుడికి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ఎమ్మెల్యే టికెట్‌పై ఆశ ఉంది: రాజయ్య

    స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఇప్పటికీ ప్రజాభిమానం తనపైనే ఉందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఎన్నికల నాటికి కచ్చితంగా టికెట్ తనకే వస్తుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. నివేదికలు, సర్వేల ద్వారా కేసీఆర్ తనవైపే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయన రాష్ట్ర రైతు బంధు సమితి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవితో తన బాధ్యత పెరిగిందని.. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.

    ‘రూ.50 వేలకు మించి బయటకు తేవద్దు’

    తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు. చందానగర్‌లో 5.5 కిలోల బంగారం పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా 50వేలకు మించి నగదు బయటికి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు. ఒకవేళ 50 వేలకు మించి నగదుతో పాటు బంగారు నగలు బయటకు తీసుకువస్తే వెంట సరైన పత్రాలు ఉండాలి అని … Read more

    నేడు అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

    ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెట్లతో నేడు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో మోదీ సంభాషించనున్నారు. అటు ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ గేమ్స్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.

    మళ్లీ పెరిగిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ వారంలో వరుసగా రెండో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 పెరిగి రూ.53,350కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ.58,200కు ఎగబాకింది. కిలో వెండి ధర రూ. 500 పెరగింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,500కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.