• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విట్టర్‌లో కీలక మార్పు

    ట్విట్టర్‌ కీలక మార్పు తీసుకొచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసింది. ఇకపై వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా కొత్త ఆప్షన్‌ను యాడ్ చేసింది. ఇదివరకు ఎవరైన వెరీఫైడ్ అకౌంట్ ఉన్న ప్రముఖులు పోస్ట్ పెడితే సాధారణ అకౌంట్లు ఉన్నవారు కామెంట్ల రూపంలో రిప్లయ్ ఇచ్చేవారు. తాజా అప్షన్‌ను వెరిఫైడ్ యూజర్ యాడ్ చేసుకుంటే కేవలం వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నుంచే రిప్లయ్‌లు వస్తాయి. సాధారణ అకౌంట్ల నుంచి రావు. ఈ ఆప్షన్ వల్ల ప్రముఖులకు ట్రోలింగ్ బెడద తగ్గనుంది.

    1500 మంది మిలిటెంట్లను ఏరిపారేశాం: ఇజ్రాయెల్

    తమ దేశంలోకి చొరబడి మారణ హోమం సృష్టిస్తున్న హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృత దేహాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వారిని తరిమికొట్టినట్లు ప్రకటించింది. అయితే ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు వివరించాయి.

    చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటల నుంచి హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. వాదనలు మొత్తం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని సాల్వే, వర్తించదని రోహత్గి బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

    సీఐడీ విచారణకు లోకేష్

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ చేంజ్ చేశారని లోకేష్‌పై సీఐడీ అభియోగాలు మోపింది. రాష్ట్ర విభజనకు ముందు హెరిటెజ్ సంస్థ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాలు ల్యాండ్ కొంటే అవినీతి ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.

    నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్

    అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోను కేసీఆర్ ప్రకటించనున్నారు. అదే రోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో గులాబీ బాస్ కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవంబర్ 9న రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న మధ్యాహ్నం … Read more

    చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు

    సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘ఈ కేసు మూలంలోనే తప్పు ఉంది. అన్నీ కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ తయారు చేశారు. ఇందులోని ఎఫ్‌ఐఆర్ చట్టబద్దం కాదు. 164 కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారు. దానిని సవాలు చేస్తున్నాం’ అని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు లభించాక 2021లో సీఐడీ కేసు నమోదు చేసింది. 17A చట్ట … Read more

    శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం

    మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన అంశాలను శ్రీనివాస్ గౌడ్ తప్పుగా చూపించారని పేర్కొన్నారు. ఒకసారి అఫిడవిట్ సమర్పించాక రిటర్నింగ్ అధికారి నుంచి తిరిగి తీసుకుని దానిని సవరించారని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల నిబంధలకు విరుద్ధమని తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

    రష్మిక మంధాన లిప్ లాక్ చేసిన రణబీర్

    యానిమాల్ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే ఈ సాంగ్‌లో రణబీర్, రష్మికల మధ్య ఘాటైన రోమాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో లిప్‌ లాక్ సీన్ ఉండటంతో సాంగ్ ఈవిధంగా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలో విడుదలకానుంది.

    దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

    దసరా పండుగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. 5,265 బస్సులను రద్దీ మార్గాల్లో నడపనుంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై దసరా ఏర్పాట్ల గురించి చర్చించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వరకు బస్సు సర్వీసులు నడపాలని దిశానిర్దేశం చేశారు.

    BAN VS ENG: టాస్ గెలిచిన బంగ్లాదేశ్

    వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(C), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ … Read more