• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక- రణబీర్

    యానిమల్ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. అమ్యాయి అంటూ సాగే సాంగ్‌లో రణబీర్, రష్మిక మంధాన లిప్‌లాక్‌తో రెచ్చిపోయారు. సాంగ్ మొత్తం ఫుల్ రోమాంటిక్‌గా సాగింది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కాగా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ మోస్ట్ వైలెంట్‌గా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

    శంషాబాద్‌లో భారీ భూ కుంభ కోణం

    శంషాబాద్ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంత ప్రభుత్వాధికారులు, రియల్టర్‌లతో కలిసి రూ.1000 కోట్ల విలువైన భూముల రికార్డులు మార్చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని రియాల్టర్లకు అప్పగించారు. పెద్ద గొల్కొండ గ్రామంలో 190 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 25 ఏళ్ల కిందట ఈ భూమిని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇవి అసైన్డ్ భూములు వీటిని కొనడం గాని అమ్మటం గాని చేయరాదు. అయితే వీటి రికార్డులు మార్చి రియాల్టర్లకు అప్పగించారు ప్రభుత్వాధికారులు.

    మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన తప్పుడు వార్తలు రాస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ నిరసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నట్లు విమర్శించారు. ఈ వార్తల వల్ల కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు.

    నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్

    సీఐడీ ముందు రెండో రోజు విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌ను నిన్న ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు లోకేష్ రానున్నారు. మరోవైపు నిన్న జరిగిన విచారణలో కేసుతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు అడిగారని ఆరోపించారు.

    నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్ ఢీ

    వరల్డ్‌కప్‌లో భాగంగా ఢిల్లీ- అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నెగ్గినప్పటికీ.. టాప్ ఆర్డర్ వైఫల్యం చెందటం కలవరపెట్టింది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టాప్ ఆర్డర్ గాడిలో పడేందుకు ఈ మ్యాచ్ గొప్ప అవకాశం. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ 2 గంటలకు ప్రారంభం కానుంది.

    వచ్చే 5 ఏళ్ల కోసం బీజేపీని ఎన్నుకోండి: అమిత్ షా

    వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆదిలాబాద్ సభలో అమిత్ షా పిలుపునిచ్చారు. ‘2014 ముందు దేశంలో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసాం. విదేశాల్లో భారత్ … Read more

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    శ్రీవారి దర్శనానికి 8 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 71,361 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,579 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.53,650కి ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.330 పెరిగి రూ.58,530కి చేరింది. అటు కిలో వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.