• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్- రాజమౌళి చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్

    సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తైనట్లు తెలిసింది. ఫైనల్ స్క్రిప్ట్‌ను విజయేంద్ర ప్రాసాద్ లాక్ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అత్యంత సాహోసోపేతమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇదంతా: అంబటి

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు. జగన్ నన్ను ఏం పీకుతాడన్న చంద్రబాబు మాటలకు సమాధానం ఇప్పుడు వచ్చింది. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయటపడింది. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. అదే అయితే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.

    IND VS AFG: టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్

    వరల్డ్‌కప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్. భారత్ : రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (W), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ … Read more

    రజినీకాంత్ భార్య లతపై చీటింగ్ కేసు

    సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతపై ఉన్న చీటింగ్ కేసును సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. 2014లో రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్ సినిమాకు చెన్నై యాడ్ సంస్థ పనిచేసింది. అయితే ప్రమోషన్ వర్క్స్‌కు పనిచేసిన పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని లతపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం చీటింగ్ కేసును పునరుద్ధరించింది.

    కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి: బండి సంజయ్

    తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు అతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని మళ్లీ బీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.

    వ్యూహం, శపథం రిలీజ్ డేట్స్ ఫిక్స్

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ డైరెక్టర్ ఆర్జీవీ పొలిటికల్ హీట్ పెంచుతూ రెండు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ‘వ్యూహం’ చిత్రాన్ని నవంబర్ 10 విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో వైఎస్‌ఆర్ మరణం, జగన్‌పై సీబీఐ విచారణ, జగన్ ఓదార్పు యాత్ర వంటి అంశాలు ఉంటాయి. ఇక శపథం సినిమాలో అసెంబ్లీలో జగన్ శపథం, పొలిటికల్ పాదయాత్ర, సీఎంగా ప్రమాణం వంటి అంశాలను తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 25న … Read more

    టైగర్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. టైగర్ 3 టీజర్ అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సల్మాన్ ఖాన్ పోస్టర్ రిలీజ్ చేసారు. 20 ఏళ్లు దేశం కోసం పాటుపడిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అనే ముద్ర వేస్తే.. ఎలా తనపై పడిన ముద్రను చేరిపేసుకుంటాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని మనీష్ శర్మ … Read more

    బాంబులతో దద్దరిల్లుతున్న గాజా

    గాజా బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 1900 మంది చనిపోయారు. బందీలకు ఎలాంటి హాని చేసినా పాలస్తీనా అంతు చూస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలో 900 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీన తెలిపింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల దాడిలో 14 మంది అమెరికన్లు చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.

    చంద్రబాబు ఆడేది సింపతి గేమ్: అమర్నాథ్

    టీడీపీ అధినేత చంద్రబాబు సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్‌లో కాదు జైల్లో ఉన్నారు.. నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారంతో సింపతీ కోసం చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు అని ఆరోపించారు.

    ఈ పిల్లాడ్ని మిస్ అవుతున్నా: కేటీఆర్

    మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును బాగా మిస్‌ అవుతున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేటీఆర్ ఫ్యామిలీకి టైం కేటాయించలేక పోతున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్న తన కుమారుడిని గుర్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో హిమాన్షుతో జాగింగ్‌ చేస్తూ దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. “ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా” అనే క్యాప్షన్‌ను ఫోటోకు జోడించారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.