• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కావట్లేదని రోడ్డెక్కిన యువకుడు

    చీరాలలో పెళ్లి కాలేదని ఓ యువకుడు వినూత్నంగా రోడ్డు మీదకు ఎక్కాడు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలుచుని తనని తాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి గల కారణాలను ఓ ప్లెక్సీలో రాశాడు. తాను ఏ యువతికైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. కట్నం పట్టింపులు లేవని తనను పెళ్లి చేసుకునే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. Courtesy Twitter: Courtesy Twitter:

    జానా రెడ్డికి కీలక బాధ్యతలు

    కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానా నైతృత్వంలో ఫోర్ మెన్ కమిటీ నియమించింది. జానారెడ్డి , మణిక్రావు ఠాక్రే , దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్‌తో కమిటీ ఏర్పడింది. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులని బుజ్జగించే బాధ్యత వీరు తీసుకోనున్నారు. ఈరోజు జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. 70 … Read more

    గర్భిణీల పౌష్ఠికాహారంలో చనిపోయిన పాము

    టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాము కళేబరమున్న ఖర్జూరాల్ని గర్భిణులకు పంపిణీ చేశారని ఆరోపించారు. సైకో జగన్‌ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చిన ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్న ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము బయటపడినట్లు పేర్కొన్నారు. https://x.com/naralokesh/status/1712295250071310554?s=20

    సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ?

    తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిలవనున్నట్లు తెలిసింది. 100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగనున్నారు. మిర్యాలగూడ, పాలేరులో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో షర్మిల ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలుత YSRTP పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని భావించినప్పటికీ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడంతో ఒంటరిగానే బరిలోకి … Read more

    స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల వృద్ధితో 66,528 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీ 16 పాయింట్లు లాభపడి 19,828 పాయింట్ల వద్ద కదలాడుతోంది. SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.15 వద్ద ప్రారంభమైంది.

    బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం

    బిహార్‌- రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మంది మృతి చెందగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యకు నార్త్ ఈస్ట్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. … Read more

    శ్రీవారి దర్శనానికి 6 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,388 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.3.74కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ఎన్నికల ఏర్పాట్లపై సీవీ ఆనంద్ సమీక్ష

    ఎన్నికల ఏర్పాట్లపై పోలీసులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రచారాలు ఒకే మార్గంలో తారసపడకుండా చూడాలి. రూట్‌ ప్లానింగ్, టైమింగ్‌, పర్మిషన్ల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీసులపై నిఘా పెట్టాలి. డబ్బు, బంగారం, మద్యం సీజ్ చేసే సమయంలో విధానాలు అమలు చేయాలి. ఎన్నికలు ముగిసేవరకు పోలీసుల నిరంతర నిఘా.. హవాలా ఆపరేటర్లపై నిఘా ఏర్పాటు చేయాలి. ఓటర్లను ప్రలోభపెట్టే గిఫ్ట్‌ల పంపిణీలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని … Read more

    ఈనెల 13 నుంచి దసరా సెలవులు

    తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నెల 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 26న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తం 13 రోజులు హాలీడేస్ వచ్చాయి. మరోవైపు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1, 2 పరీక్షల మార్కులను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాలని అన్ని పాఠశాలలను విద్యాశాఖ ఆదేశించింది. అటు అన్ని జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 19 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

    అన్నీ వేళ్లు చంద్రబాబు వైపే: సజ్జల

    చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ‘నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించుకోగలరా? ఊరు పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేయించారు. సీమెన్ సంస్థ కూడా మాకు సంబంధం లేదని తెలిపింది. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అన్నీ ఆధారాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చారు.