తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిలవనున్నట్లు తెలిసింది. 100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగనున్నారు. మిర్యాలగూడ, పాలేరులో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో షర్మిల ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలుత YSRTP పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని భావించినప్పటికీ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల నిర్ణయించుకుంది.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్