• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ ఇద్దరే తెలంగాణ ద్రోహులు: షర్మిల

    సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్‌టీపీఅధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని విమర్శించారు. ప్రజలు నమ్మి రెండు సార్లు అధికారమిస్తే రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని షర్మిల విమర్శించారు.

    TS: ఎన్నికల్లో పోటీకి షర్మిల దూరం

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్ధేశం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని షర్మిల పేర్కొన్నారు.

    వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు

    వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్‌ గుర్తును కేటాయించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల భరిలో నిలవనుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

    119 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

    తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని YSRTP నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని ప్రకటించారు. తల్లి విజయమ్మ, భర్త అనీల్ కూడా పోటీ చేస్తారని చెప్పారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు.

    సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ?

    తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిలవనున్నట్లు తెలిసింది. 100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగనున్నారు. మిర్యాలగూడ, పాలేరులో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో షర్మిల ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలుత YSRTP పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని భావించినప్పటికీ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడంతో ఒంటరిగానే బరిలోకి … Read more

    షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్లు

    కాంగ్రెస్ పార్టీలో YSR తెలంగాణ పార్టీ విలీనం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం రెండు బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు, ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్‌ను ప్రతిపాదించింది. అయితే పాలేరు అసెంబ్లీ సీటును షర్మిల ఆశిస్తుండగా.. అధిష్ఠానం కుదరదని చెప్పినట్లు టాక్. ఈరోజు లేదా రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో ఆమె భేటీ కానుంది.

    పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల

    YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇంటి నుంచి తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో SIపై చేయి చేసుకున్నారు. వ్యక్తిగత పనులకు కూడా తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎందుకు వెళ్లనివ్వడం లేదో కారణం చెప్పాలని రోడ్డుపై బైటాయించారు. పోలీసులు తిరిగి ఆమెను ఇంట్లోకి పంపించారు. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిలపై బంజారహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 350కింద కేసు నమోదు చేశారు.

    ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    [VIDEO](url):హైదరాబాద్‌లో YSRTC అధినేత్రి షర్మిల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న షర్మిల కారుపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై నిరసనగా ఆమె ఇవాళ అదే కారులో ప్రగతిభవన్‌ వైపు బయల్దేరారు. సోమాజిగూడ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను కారు దిగాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో కారును అలాగే టోవింగ్‌ బండికి కట్టి లాక్కెళ్లారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక ఆమెను బలవంతంగా కారులోంచి దింపి స్టేషన్‌లోకి తరలించారు. #WATCH | Hyderabad: Police drags away the … Read more