• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: ఎన్నికల్లో పోటీకి షర్మిల దూరం

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్ధేశం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని షర్మిల పేర్కొన్నారు.

    వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు

    వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్‌ గుర్తును కేటాయించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల భరిలో నిలవనుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

    119 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

    తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని YSRTP నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని ప్రకటించారు. తల్లి విజయమ్మ, భర్త అనీల్ కూడా పోటీ చేస్తారని చెప్పారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు.

    సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ?

    తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిలవనున్నట్లు తెలిసింది. 100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగనున్నారు. మిర్యాలగూడ, పాలేరులో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో షర్మిల ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలుత YSRTP పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని భావించినప్పటికీ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడంతో ఒంటరిగానే బరిలోకి … Read more