• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ

    రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. కానిస్టేబుల్ సంయమనం పాటించినప్పటికీ విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. మిథిలేష్ అనే మహిళా నెంబర్ ప్లేట్ లేకుండా రాంగ్ రూట్‌లో రోడ్డు మీదకు వచ్చింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ట్రాఫిక్ పోలీసుతో వాగ్వాదానికి దిగి చెప్పుతో కొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. https://x.com/TeluguScribe/status/1712361640732369311?s=20

    నేను సీఎం అయితా: కోమటిరెడ్డి

    తాను సీఎం అయినంక రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తా అని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి సీఎం రేసులో ఇద్దరు, ముగ్గురం సీఎం అభ్యర్థులు ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముందు ఎన్నికల్లో ఎలా గెలవలనేదానిపై దృష్టి పెడితే మంచిదన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను అధిష్ఠానం చూసుకుంటుందని సూచించారు. తొందరపాటు వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన కావొద్దని అభిప్రాయపడ్డారు.

    హరీష్, కేటీఆర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

    ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో కీలక సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇద్దరితో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ ఆలోచనలు పంచుకోనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.

    మహేష్ బాబు కొత్త ఫొటో వైరల్

    సూపర్ స్టార్ మహేష్ బాబు లెటెస్ట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ చేస్తూ ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహేష్ కనిపించాడు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గుంటూరు కారం సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్, రాజమౌళిలో సినిమా చేయనున్నాడు.

    లోకేష్ బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పోజ్

    స్కిల్ స్కాం కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ముందు వాదనలు వినిపించిన సీఐడీ.. లోకేష్‌ను అరెస్ట్ చేయం. కానీ 41ఏ కింద నోటీసులు అందిస్తాం. విచారణకు పిలుస్తాం అని పేర్కొంది. మరోవైపు ఆంగళ్లు కేసులో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రేపు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది.

    మూడేళ్లకోసారి పవన్ భార్యలు మారుతారు: జగన్

    సామర్లకోట సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దత్తపుత్రుడికి ఇక్కడ శాశ్వత చిరునామా లేదు. ఆయన ఇల్లు హైదరాబాద్‌లోనే. రెండు సినిమాల షూటింగ్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతాచు. యూజ్ అండ్ త్రో పవన్ పాలసీ. మూడు నాలుగేళ్లకోసారి ఆయన భార్యలు మారుతుంటారు. ఫస్ట్ లోకల్, తరువాత నేషనల్, ఆతర్వాత ఇంటర్నేషనల్ స్థాయికి భార్యల మార్పు జరిగిందన్నారు. ఆడవాళ్లన్నా, పెళ్లిలన్నా గౌరవం లేదు అని ఆరోపణలు గుప్పించారు.

    సొంత అత్తను కాల్చిచంపిన కానిస్టేబుల్

    హనుమకొండ- గుండ్ల సింగారంలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఆస్తి గొడవల కారణంగా సొంత అత్తను అల్లుడు కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న హతురాలు కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రసాద్‌ కోటపల్లి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రసాద్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

    పేదవాడి కల నిజం చేశాం: సీఎం జగన్

    కాకినాడ-సామర్ల కోటలో జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఇళ్లు కాదు.. ఊళ్తు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండి పేదవాడికి సెంట్ భూమి కూడా పంచలేదు. కానీ ఇప్పుడు పేదవాడి కలను నిజం చేశాం’ అని చెప్పుకొచ్చారు.

    బేబి సినిమా డైరెక్టర్‌కు ‘ఐకానిక్’ అవార్డు

    బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్‌ ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రెండింగ్ ఐకానిక్ దర్శకునిగా అవార్డు గెలిచాడు. యంగ్ హీరో దేవరకొండ ఆనంద్, కుర్ర హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో బేబీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఓటీటీలోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇనోవేటివ్ అవార్డు రావడంతో మరిన్నీ అవార్డులు బేబీ మూవీ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది.

    టైగర్ నాగేశ్వరరావు ‘రన్ టైం’ లాక్

    మాస్ మహారాజా రవితేజ నుపుర్ సనన్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా రన్ టైం తాజాగా లాక్‌ అయింది. టైగర్ నాగేశ్వరరావు రన్‌ టైం 3 గంటల 2 నిమిషాల నిడివితో కట్‌ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. సినిమా ప్రమోషన్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హిందీలో ప్రమోషన్ కోసం రవితేజ స్వయంగా రంగంలోకి దిగాడు.