• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన వేళ.. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం పట్టుబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన డబ్బు, బంగారం మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 4 రోజుల్లోనే ఈ స్థాయిలో పట్టుబడటం గమనార్హం. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది.

    ఓటీటీలోకి మార్క్ ఆంటోని సినిమా

    తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. SJ సూర్య విలక్షణ పాత్రలో నటించాడు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘మార్క్ అంథోని’ని తెరకెక్కించారు. తమిళ్‌లో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. విశాల్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

    సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారా?

    గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్న వారిని కేంద్ర సైబర్ నిఘా సంస్థ హెచ్చరించింది. కంప్యూటర్, మొబైల్స్‌లో పాత క్రోమ్ వాడుతున్నట్లైతే వెంటనే దానిని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పాత క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తక్షణం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

    రేవంత్, హరీష్ బలికా బకరాలు: బండి

    BRS, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. “ఇతర పార్టీలలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటి. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎంపిక చేసి ఢిల్లీకి పంపాం. కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్‌కి వెళ్ళింది. రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదు. … Read more

    నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

    స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించనుంది. సోమవారం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గట్టిగా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆయన అరెస్ట్ చేసే టైంలో గవర్నర్ అనుమతి పోలీసులు తీసుకోలేదని వాదించారు. మరోవైపు 17ఏ చంద్రబాబుకు వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈరోజు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు … Read more

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    నేడు ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష

    ఆరోగ్య శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ జరుగుతున్న తీరును పరిశీలించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీల పనుల పురోగతి, హాస్పిటళ్ళల్లో నాడు -నేడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పై అధికారులతో చర్చించనున్నారు.

    నేడు బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ ఢీ

    నేడు క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లో ఫెవరెట్‌గా న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఒక విజయం ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. చిన్నస్వామి పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

    కారును పోలిన గుర్తులపై సుప్రీంకు బీఆర్ఎస్

    వచ్చే ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో పిటిషన్‌ను వెనక్కు తీసుకుంది. గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు పిటిషన్‌లో పేర్కొంది. రోడ్ రోలర్, చపాతి రోల్ వంటి గుర్తులను తొలిగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.