• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌పై అభిమానంతో సినిమా తీశా: RGV

    ‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది.. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది.. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను వైఎస్‌ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా … Read more

    కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీకాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. జనగామా టికెట్‌ను తనకు కాకుండా మరొకరికి కేటాయించడంపై పొన్నాల ఆగ్రహంగా ఉన్నారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి జనగామా టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. దీంతో మనస్తాపం చెందిన పొన్నాల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

    ‘తెలంగాణను ఆంధ్రలో కలపాలనుకుంటున్నారు’

    మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. ఆంద్రవాళ్లు తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలపాలని చూస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? కాంగ్రెస్ బీ ఫారమ్‌లు బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ బీ ఫారమ్‌లు కాంగ్రెస్ ఆఫీసులో తయారవుతున్నాయి. ఎన్నికలప్పుడు వచ్చేవారిని చూసి ప్రజలు మోసపోవద్దు’ అని చెప్పుకొచ్చారు.

    వ్యూహం ట్రైలర్ విడుదల

    సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో చంద్రబాబు, పవన్ పాత్రలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర, ఓదార్పు యాత్రకు సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరో 6 నెలల్లో ఏపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పొలిటికల్ హీట్ పెంచుతోంది.

    ఫోన్ చేసి చెప్పినా తప్పుకుంటా: అనిల్ కుమార్

    మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పుకోమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఫోన్‌లో ఆదేశించినా సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. YSR కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి జగనన్నతోనే ఉన్నాను. పదవిలో ఉన్నా లేకపోయినా జగనన్నతోనే ఉంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    బోరబండలో ఘోర విషాదం

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఇద్దరు కుమార్తెలతో తండ్రి ఆత్మ హత్య మరవక ముందే.. బోరబండలో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే మహిళ తన ఇద్దరు కొడుకులకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఇద్దరు చిన్నారులను అర్జున్(4), ఆదిత్య(2)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే జ్యోతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    రేపు ఆకాశంలో అద్భుతం

    రేపు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రేపు సా.4.30 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతోంది. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, దక్షిణ మధ్య అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించనుంది. భారత్‌లో ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం ఏర్పడటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. చివరి సారిగా రింగ్‌ ఆఫ్ ఫైర్ 2012లో కనిపించింది.

    ఇజ్రాయేల్ వార్నింగ్‌పై ఐరాస ఆందోళన

    గాజా- ఇజ్రాయేల్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి ఆందోళ వ్యక్తం చేసింది. తాజాగా గాజాలో నివసిస్తున్న ప్రజలు 24 గంటల్లోగా ఖాళీ చేసి దక్షిణాదికి వెళ్లాలని ఇజ్రాయేల్ సైన్యం హెచ్చరించింది. గాజాలో ఉన్న హమాస్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని వెల్లడించింది. 11 లక్షల మంది సామాన్యులు ఉన్నపళంగా వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వర్గాలు సంయమనం పాటింటాలని సూచించింది.

    ‘పాక్-ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి’

    సోషల్ మీడియాలో #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. మన సైనికుల జీవితాల ముందు క్రికెట్ నథింగ్. శత్రువులు ఎప్పటికీ శత్రువులే. పాక్ క్రికెటర్లకు మహిళలతో డ్యాన్స్‌లు చేయిస్తూ స్వాగతం పలికాం.. కానీ అదే రోజు మన సైనికులను పాక్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. పుల్వామా వంటి ఘటనలను ఇంకా దేశ ప్రజలు మరిచిపోలేదు. పాక్ క్రికెటర్లను బాయ్ కాట్ చేయాలి. బీసీసీఐ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తోంది అని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ‘బలగం’ సినిమా మరో రికార్డు

    కమెడియన్ వేణు ఎల్దంది డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బలగం మరో రికార్డు సృష్టించింది. థియేటర్లు, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమా టీవీలోనూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా ఇటీవల స్టార్ ‘మా’ లో ప్రసారం అయ్యింది. అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా విడుదలైంది. బలగం మూవీకి ఏకంగా 8.42 TRP రేటింగ్ వచ్చింది. దీంతో బలగం సత్తా మరోసారి నిరూపితమైంది.