• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ జాబితాలో 12 కొత్త ముఖాలు

    కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలోని 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. సీపీఎం అడిగిన భద్రాచలంలో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేషంకు నకిరేకల్ టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి సీట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ ఈసారి బరిలోకి దిగుతున్నారు.

    ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు బాల త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. కాసేపట్లో దర్శనాలు ఆరంభం కానున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భారీగా తరలి వస్తుండటంతో కొండపైకి ప్రైవేటు వాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

    కేసీఆర్ ఎన్నికల రథం సిద్ధం

    తెలంగాణ ఎన్నికల ప్రచారానికి BRS ప్రచార రథం సిద్ధమైంది. గులాబీ వర్ణంలో రూపొందిన ఈ బస్సులో అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్ ఈ వాహనం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వాహనంపై తెలంగాణ, భారత దేశ చిత్ర పటంతో పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్కడి సభలో బీఆర్ఎస్ మెనిఫెస్టో ప్రకటించనున్నారు.

    టీమిండియాపై పాక్ కోచ్ అక్కసు

    పాకిస్థాన్ కోచ్ మిక్కి అర్థర్ భారత్‌తో మ్యాచ్ అనంతరం తన అక్కసు వెళ్లగక్కారు. ‘మ్యాచ్ ఐసీసీ ఈవెంట్‌లా జరగలేదు. బీసీసీఐ ఈవెంట్‌లా జరిగింది. స్టేడియంలో 99శాతం బ్లూజెర్సీ వెసుకుని ఇండియాను సమర్థించారు. ప్రేక్షకుల నుంచి పాకిస్థాన్‌కు మద్దతు లభించలేదు. ఇది మా ఆటగాళ్లను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. పాక్ ఓటమికి ఇదొక్కటే కారణం కాదు.. ఆటగాళ్ల ప్రదర్శన కూడా అంచనాలకు తగ్గట్టు లేదు’ అని చెప్పుకొచ్చారు.

    టీకాంగ్రెస్ తొలి జాబితా విడుదల

    తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. టికెట్లు దక్కని ఆశవాహులను బుజ్జగించేందుకు జానా రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది. వచ్చే వారం నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ బస్సు యాత్ర చేపట్టనున్నారు. Courtesy Twitter: Courtesy Twitter:

    శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    నేడు ఇంగ్లండ్‌తో అఫ్గానిస్థాన్ ఢీ

    ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఇంగ్లండ్‌తో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న అఫ్ఘానిస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. న్యూజిలాండ్‌తో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ఫేవరెట్‌గా ఉంది.

    అందుకే రాజీనామా చేశా: పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అమ్మకానికి పెట్టారు. గత రెండేళ్లుగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తాము పరాయి వాళ్లము అయ్యాం. మా బాధలు చెప్పుకునేందుకు 50 మంది బీసీ నేతలం వెళ్తే ఏఐసీసీ అపాయింట్ మెంట్ ఇవ్వదు. ఎక్కడైనా రేవంత్‌కు నమస్తే పెడితే కనీసం స్పందించడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    చంద్రబాబు 5 కేజీలు తగ్గారు: భువనేశ్వరి

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలులోని వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్లే చంద్రబాబుకు చర్మ సమస్యలు వచ్చాయని విమర్శించారు. కలుషిత నీరు తాగటం వల్ల ఆయన కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన 5 కేజీలు బరువు తగ్గారు. ఆందోళనలను పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోయారు.

    పొన్నాలకు జనగామ టికెట్?

    జనగామ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు స్వయంగా కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లనున్నారు. జనగామ టికెట్‌పై ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. పొన్నాల బీఆర్ఎస్‌లోకి చేరికతో ఆ టికెట్ ఆయనకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరెడ్డి ప్రచారంలో ఉన్నారు. ఇటీవలే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య హరీష్ సయోధ్య కుదిర్చిన సంగతి తెలిసిందే.