• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్ బాస్ హౌస్‌లోకి ‘శుభ శ్రీ’ రీ ఎంట్రీ?

    బిగ్‌బాస్ హౌస్‌లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి ఎలిమినేట్ అయిన రతిక రోజ్, దామిని, శుభశ్రీలో ఒకరికి తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాగార్జున అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో శుభశ్రీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 5 వారాల జర్నీలో శుభశ్రీ టాస్క్‌ల పరంగా 100శాతం ఎపర్ట్స్ అయితే ఇచ్చింది. మరి హౌస్‌లోకి … Read more

    ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

    సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మెనిఫెస్టోని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న 93 లక్షల మందికి కేసీఆర్ బీమా కింద రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నాం. బీమా ప్రిమియం డబ్బును ఎల్‌ఐసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. దివ్యాంగుల పెన్షన్‌కు రూ.6 వేలకు పెంచుతున్నాం. రైతు బంధు పథకం డబ్బును రూ.16 వేలకు పెంచుతున్నాం. అసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంచుతున్నాం. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అక్రిడేషన్‌లో ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్లు అందిస్తున్నట్లు చెప్పారు.

    ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షలు పంపిణీ

    బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఫారమ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చొప్పున పార్టీ ఫండ్ రూపంలో చెక్‌లు అందించారు. ప్రస్తుతం 51 మందికి మాత్రమే బీఫారమ్‌లు అందజేసిన కేసీఆర్.. మిగతావారికి రేపు బీఫామ్‌లు ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి అని సూచించారు. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.

    ఇస్లాం దేశాల అత్యవసర భేటీ!

    ఇజ్రాయేల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో ఆర్గనైజేషన్‌ ఆప్ ఇస్లామిక్ కంట్రీస్ కూటమి(OIC) సభ్య దేశాల భేటీకి పిలుపునిచ్చింది. ఈ కూటమికి సౌది అరేబియా నాయకత్వం వహిస్తోంది. గాజాలో ఏర్పడిన మానవత సంక్షోభం దృష్ట్యా సమావేశానికి ఆహ్వానించింది. గాజాలో సామాన్యుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. యుద్ధాన్ని నిలువరించేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల ఇజ్రాయేల్‌తో కుదిరిన ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదే విషయాన్ని అమెరికా, ఇజ్రయేల్‌కు స్పష్టం చేసింది.

    రీ రిలీజ్‌కు రెడీ అయిన శంకర్‌దాదా MBBS

    మెగాస్టార్ నటించిన బ్లాక్‌బాస్టర్ మూవీ శంకర్‌దాదా MBBS చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను నవంబర్‌ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సొనాలి బింద్రే, శ్రీకాంత్ ప్రధాన పాత్రాల్లో నటించగా.. జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

    ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ జాబితా విడుదల

    ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 30 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం భూపేష్ బఘేల్‌ బరిలోకి దిగనున్నారు. అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోకు టికెట్ కేటాయించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 144 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేశారు. ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి మాజీ సీఎం కమల్​ నాథ్​ పోటీ చేయనున్నారు. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు … Read more

    దెబ్బతీసేందుకు కుట్ర: కేసీఆర్

    తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు.. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలి.. మాకే అంతా తెలుసు అనుకోవద్దు. మళ్లీ విజయం మనదే, ఎవరూ తొందరపడొద్దు.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు.. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు.. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలి. మనల్ని గెలవలేకే కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పుకొచ్చారు.

    2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాం: మోదీ

    2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ తరఫున అన్ని విధాల కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 141 కోట్ల భారతీయులు ఒలింపిక్స్ క్రీడల కోసం ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2029లో యూత్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఓసీ- జియో కన్వెన్షన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతోందని గుర్తు చేశారు.

    నానితో లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన మృణాల్

    నేచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామాగా మూవీ సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఎప్పటిలాగే మృణాల్ ఠాకూర్ తన గ్లామర్‌ ప్రదర్శనతో రెచ్చిపోయింది. నాని లిప్‌ లాక్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. https://youtube.com/watch?v=GDVT4raMjRY%26t

    రికార్డులు బ్రేక్‌ చేసిన భారత్- పాక్ మ్యాచ్

    నిన్న జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌కు డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రికార్డు వ్యూయర్ షిప్ లభించింది. దాదాపు 3.5 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లభించని ఓటీటీ రెస్పాన్స్ ఇండియా- పాక్‌ మ్యాచ్‌కు లభించింది. దీంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఇండియా- పాక్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల మధ్య హైవోల్టేజీ జనరేట్ అవుతుంది. ప్రేక్షకుల మధ్య భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది.