• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్థాన్ భారీ స్కోర్

    ప్రపంచకప్‌- ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన అఫ్గాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ 57 బంతుల్లో 80 చెలరేగి ఆడాడు. ఇక్రమ్ 66 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ 16 బంతుల్లో 28 పరుగులు రాబట్టడంతో అఫ్గానిస్థాన్ ధీటైన స్కోరు సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్‌ వుడ్ 2, లివింగ్‌ స్టోన్, టాప్లీ, జోరూట్ తలా ఒక్కో వికెట్ … Read more

    భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్ బుకింగ్స్ స్టార్ట్

    దసరా బరిలోకి దిగుతున్న బాలయ్య సినిమా భగవంత్ కేసరి, రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర్‌రావు అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అలాగే తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. భారీ అంచనాలతో ఈ మూడు సినిమాలు దసరా బరిలో పోటీపడుతున్నాయి. టైగర్ నాగేశ్వర్‌రావు, భగవంత్ కేసరి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

    కేసీఆర్‌ను కలిసిన పొన్నాల

    ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కలిశారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికారు. కాసేపు ముచ్చటించిన వీరిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పొన్నాల లక్ష్మయ్యాకు అపార అనుభవం ఉంది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. https://x.com/TeluguScribe/status/1713530171247194400?s=20

    కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీకొట్టారు: జానా రెడ్డి

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని జానారెడ్డి అన్నారు. ‘మా పథకాలను చూసి కేసీఆర్‌ తన పథకాలను మార్చుకున్నారు. మేనిఫెస్టోలో వచ్చిన పథకాలను కాంగ్రెస్ పార్టీని చూసి భయపడే వచ్చినవే. మేము చెప్పింది చేస్తాం. నిజంగా పథకాలు అమలులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి’ అని జానా రెడ్డి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి కేసీఆర్‌కు చలి జ్వరం పుట్టుకొచ్చిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు.

    ప్రజలు తెలివితో ఓటు వేయాలి: కేసీఆర్

    బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్ హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివితో ఆలోచించాలి. మోసపోవద్దు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పటికీ 10 సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారం చేసింది. బీఆర్ఎస్ విజయ ప్రస్థానానికి హుస్నాబాద్ వేదిక కావాలి. తొమ్మిదిన్నర ఏళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది. ఇప్పుడు తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. మరోసారి అధికారంలోకి వస్తే రూ.5 వేలు ఇస్తాం’ అని అన్నారు.

    ఐఫోన్ పొగొట్టుకున్న ఊర్వశి రౌటేలా

    పాకిస్థాన్- ఇండియా మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్‌ను పొగొట్టుకుంది. శనివారం మ్యాచ్ చూసేందుకు మోదీ స్టేడియానికి వెళ్లింది. ఇండియా- పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న మోజులో ఐఫోన్‌ను పొగొట్టుకుంది. ఆ ఐఫోన్ తనకు ఎంతో ప్రత్యేకమైందిగా చెప్పుకొచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌తో ఐఫొన్ తయారైందని దయచేసి ఎవరికైనా దొరికితే ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసింది.

    సైంధవ్ మూవీ టీజర్ టైం లాక్

    విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూవీ ‘సైంధవ్’. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11.34గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ కామెంట్ చేస్తూ.. చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నా. దగ్గుపాటి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నా అని తెలిపారు.

    రికార్డు సృష్టించిన శుభమన్ గిల్

    టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును అందుకున్నాడు. సెప్టెంబర్ నెలలో గిల్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ అవార్డు అతన్ని వరించింది. ఈ అవార్డు సాధించడం ద్వారా గిల్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

    ‘చంద్రబాబు పట్ల దారణంగా ప్రవర్థిస్తున్నారు’

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్ష్య పనికిరాదన్నారు. వైద్యుల నివేదికలు పక్కన పెట్టి దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ల నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

    గంజా శంకర్‌గా సుప్రీం హీరో

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంజా శంకర్ అనే టైటిల్‌ను ఖరారా చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ గంజాయి అమ్మే వ్యక్తిగా కనిపించనున్నారు. ఈరోజు సుప్రీం హీరో బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. సాయి ధరమ్ ఎన్నడు చేయని పాత్రను చేస్తున్నాడు. డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్.