• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    టైగర్ నాగేశ్వర్‌రావు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తి కావొస్తోంది. బద్రి మూవీ తర్వాత సినిమాల్లో కనిపించకపోయినా అభిమానుల ప్రేమ మాత్రం తగ్గలేదు. టైగర్ నాగేశ్వర్‌రావు మూవీలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. రవితేజ గారు తీసుకున్న నిర్ణయం నా జీవితానికి ఎంత ముఖ్యమైనదో ఆయనకు తెలియదు. పర్సనల్‌గా రవితేజగారికి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు. https://x.com/UttarandhraNow/status/1713634051394093306?s=20

    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

    టీడీపీ కార్యకర్తలు, నేతల ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ను రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేశారు. ‘చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. కోర్టు ఆదేశాలు మేరకు చంద్రబాబు బ్యారక్ నందు టవర్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేశాము. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు.

    నేడు ఆస్ట్రేలియాతో శ్రీలంక ఢీ

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా, భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చూసిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి బొణి కొట్టాలని భావిస్తోంది. అటు శ్రీలంక సైతం ఇంకా ఖాతా తెరవలేదు. కెప్టెన్ శానక గాయంతో దూరమవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ.

    శ్రీలీల గ్లిజరిన్ పెట్టకున్నా ఏడ్చేసింది: బాలయ్య

    భగవంత్ కేసరి ప్రెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. భగవంత్ కేసరి మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరిశీలిస్తే అతడి చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. నా కూతురి పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ అవసరం లేకుండా జీవించారు అంటూ ప్రశంసలు కురిపించారు. మంచి భవిష్యత్ ఉందంటూ ఆశీర్వదించారు. థమన్ అందించిన సాంగ్స్, బీజీఎం బాగుందని చెప్పుకొచ్చారు.

    గత హామీలు ఎటు వెళ్లాయి: కిషన్ రెడ్డి

    బీఆర్ఎస్ మేనిఫెస్టోపై టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ విద్యా వంటి హామీలు ఎమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులకు గతిలేని బీఆర్ఎస్ సర్కారు సన్న బియ్యం ఇస్తామనడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలనే ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

    కాంగ్రెస్‌లో మొదలైన అసమ్మతి సెగ

    కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. మేడ్చల్ సీటు ఆశించి భంగపడ్డ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశా. రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశావు. నీ అంతు చూస్తా. మేడ్చల్ జనరల్ సీటులో ‌బీసీకి టికెట్ ఇచ్చారు. ఇక పార్టీకోసం కష్టపడే ఓపికలేదు, త్వరలోనే నా కార్యాచరణను ప్రకటిస్తా అని చెప్పారు. మరోవైపు ఓల్డ్ సిటీలో టికెట్ల కేటాయింపుపై పలువురు నేతలు గాంధీ భవన్‌ను ముట్టడించి … Read more

    సోషల్ మీడియాలో ‘న్యాయానికి సంకెళ్లు’ ట్రెండింగ్

    సోషల్ మీడియాలో న్యాయానికి సంకెళ్లు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు, చేతులకు తాళ్లు, సంకెళ్లు, రిబ్బన్లు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. బాబుతో నేను అంటూ తమ నిరసన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.

    బాలయ్యకు అపార అనుభం: శ్రీలీల

    భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ‘బాలయ్య కూతురని ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం వెనకడుగు వేశాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైన చేయవచ్చు. కానీ నటనకు అవకాశం ఉన్న విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలయ్యతో శ్రీలీల డ్యాన్స్ చేసి … Read more

    కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

    బీజేపీకి షాకిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రగకాశ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల కాంగ్రెస్‌ టికెట్‌ను రేవూరి ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రేవూరి కాంగ్రెస్ నాయకత్వంతో టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ఆశవాహులను బుట్టలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ అసంతృప్త నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు.

    నేడు విశాఖలో ఐటీ హబ్ ప్రారంభం

    నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఋషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో ఐటీ సేవలను ఇన్ఫోసిస్ ప్రారంభిస్తోంది. అలాగే దసరాకు విశాఖ నుంచి పాలన కొనసాగిస్తుండటంతో పరిపాలన భవనాలను జగన్ పరిశీలించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేయనున్నారు.