• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పురందేశ్వరి ఏ పార్టీయే అర్థం కావట్లేదు’

    ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి ఏ పార్టీయో నాకు అర్థం కావడంలేదు.. చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరేది కనబడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఈమె వెనకేసుకొస్తోంది. లోకేష్‌ను వెంటబెట్టుకుని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లడం విడ్డూరంగా ఉంది. మొన్నటి వరకు బీజేపీని ఇష్టారీతిన తిట్టిన టీడీపీ నాయకులతో జతకట్టడం వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.

    27 కేజీల బంగారం పట్టివేత

    మియాపూర్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న దాదాపు 27 కేజీల గోల్డ్‌ను అధికారులు సీజ్ చేశారు. మరో 15 కేజీల వెండి సైతం అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. పట్టుబడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం విస్తుపోయేలా చేస్తోంది.

    నేను విశాఖకు షిఫ్ట్ అవుతాను: సీఎం జగన్

    విశాఖలోని రుషికొండలో ఇన్ఫోసిస్ ఐటీ హబ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. నాతో పాటు పరిపాలన విభాగమంతా విశాఖకు మారుతుంది. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. ఇక్కడి నుంచి ఏపీ పరిపాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏపీ అతిపెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సమీప భవిష్యత్‌లో ఐటీ హబ్‌గా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.

    మాస్ లుక్‌లో అదరగొట్టిన వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్‌లో మాస్‌ లుక్‌తో వెంకటేష్ అదరగొట్టాడు. గతంలో ఎన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్‌తో సూపర్బ్‌గా కనిపించాడు. కాగా ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వెంకటేష్‌కు 75వ చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో సైంధవ్ నిర్మించారు. మాస్ లుక్‌లో వచ్చి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

    సిద్ధూ జొన్నలగడ్డ సరసన కేజీఎఫ్‌ హీరోయిన్

    యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, స్నేహం, కుటుంబం, త్యాగం వంటి అంశాల ప్రాతిపదికను ఈ చిత్రం తెరకెక్కుతోందని మూవీ మేకర్స్ తెలిపారు.

    స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 66,213 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,740 పాయింట్ల వద్ద కదలాడుతోంది. HCL టెక్, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

    అకీరా నందన్‌ను హీరో చేయాలి: విజయేంద్ర ప్రసాద్

    పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు అకీరా నందన్‌పై దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘రేణు దేశాయ్ గారు మీరు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ అబ్బాయి అకీరా నందన్‌ను హీరోగా చేయాలి. అకీరా నందన్ చేసే మూవీలో అతని తల్లి పాత్రను కూడా మీరే చేయాలనేదే నా మాట’ అంటూ తన మనసులో మాట బయట … Read more

    నేడు జనగామ, భవనగిరి సభలకు కేసీఆర్

    ఆదివారం హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్… ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేశారు. నేడు జనగామా, భువనగిరి ప్రజాశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. జనగామ మెడికల్ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు లక్షమందిని సమీకరిస్తున్నారు. ఈ ప్రజాశీర్వాద సభలో జనగామా అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కేసీఆర్ అభ్యర్థించనున్నారు. ఇదే సభలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

    బీజేపీ నేత కుంజా సత్యవతి మృతి

    భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సత్యవతి.. భద్రాచలంలోని ఆమె నివాసం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతిపట్ల టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ సహా ఇతర బీజేపీ నేతలు సత్యవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ బీజేపీ పోటీనే కాదు: కవిత

    ఎమ్మెల్సీ కవిత బీజేపీ, కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్‌కు పోటీనే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు పరిశీలిస్తే.. అవన్నీ బీఆర్ఎస్ పథకాలే. తెలంగాణ ప్రజలు తెలివైనవారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలను విశ్వసించరు. ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్‌నే. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.