• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంకతో నేడు పాక్ కీలక పోరు

    వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌ నేడు శ్రీలంకతో తలపడనుంది. హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్‌తో పాక్ గెలిచినప్పటికీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం కనబర్చలేదు. మరోవైపు ఇటీవల గాయపడిన తీక్షణ తిరిగి శ్రీలంక జట్టులో చేరాడు. దీంతో శ్రీలంక పేస్ దళం బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

    తలబాదుకున్న కోహ్లీ.. ఎందుకంటే?

    ఆదివారం మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కోహ్లీ 85 పరుగుల వద్ద అవుట్ కాగా.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన కోహ్లీ తాను ఆడిన షాట్‌ను గుర్తు చేసుకుంటూ అసహనానికి గురయ్యాడు. రెండు సార్లు తలబాదుకుంటూ బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ప్రతి ఆటగాడిలో కోహ్లీ లాంటి కసి ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తనకోసం కాకుండా జట్టు విజయం కోసం కృషి చేస్తాడని ప్రశంసలు కురిపించారు. https://x.com/VIPERoffl/status/1711055048732774765?s=20

    పవన్- చంద్రబాబు పొత్తుపై సెటైర్లు

    పనవ్- చంద్రబాబు పొత్తుపై సీఎం జగ్ సెటైర్లు విసిరారు. ‘చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చేవి.. మోసాలు వెన్నుపోట్లు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైళ్లో ఉన్నా ఒకటే. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి. పవన్ పార్టీ పెట్టి 15 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటివరకు కనీసం గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తే లేడు. పవన్ జీవితమంతా చంద్రబాబు భజన చేయడానికే సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్

    వరల్డ్ కప్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌పై గెలిచి మంచి ఊపులో ఉన్న న్యూజిలాండ్ నెదర్లాండ్‌పై విజయం సాధించాలని చూస్తోంది. జట్లు: న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (C), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్‌, తేజ నిడమనూరు, … Read more

    తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో… రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో గవర్నమెంట్ ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించడం కానీ, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడం, ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ప్రతిపక్ష పార్టీలు విద్వేష పూరిత ప్రసంగాలు, గుళ్లు, మసీదులు వంటి ప్రాంతాల్లో సభలు పెట్టడం నిషేధం. కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నామమాత్రపు అధికారాలకు పరిమితం కానుంది.

    చంద్రబాబు పిటిషన్‌ వాదనలు వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టులో వాదించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో స్కిల్ స్కాం 2018లో జరిగిందని ఎక్కడా లేదన్నారు. 17ఏ ఈ కేసులో కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్ననికి వాయిదా వేసింది. లంచ్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.

    షారుఖ్‌ ఖాన్‌ను చంపిస్తామంటూ బెదిరింపులు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల షారుఖ్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపడం కలకలం రేపింది. గతంలో పఠాన్ సినిమాలో బేషరమ్ సాంగ్ విడుదల సందర్భంగా వివాదం చెలరేగిన సంగతి తెలసిందే. ఈక్రమంలోనే ఆయనకు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది.

    యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ విడుదల

    సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని యాత్ర 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర సినిమాలో మమ్మూటి ప్రధాన పాత్రలో హిట్ కాగా.. దానికి సిక్వేల్‌గా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. తాజాగా ఆ చిత్రం నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వీ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

    తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 3న నోటిఫికేషన్, 10నుంచి నామినేషన్లు, 15 వరకు నామినేషన్ల విత్‌డ్రా, 30న పోలీంగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.02 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఒకే విడతలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

    స్క్రీనింగ్ కమిటీపై రేవంత్ అలక

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే పార్టీ స్క్రీనింగ్ కమిటిపై అలకబూనారు. తెలంగాణ స్క్రీనింగ్ కమటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ రేవంత్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు సీట్లు లేకపోవడం, బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళ వ్యక్తం చేశారు. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు విమర్శించారు. … Read more