• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన జగన్

    వైసీపీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం జగన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రకటనలు చేశారు. ఈమేరకు నాలుగు కీలక కార్యక్రమాలు రూపొందించారు. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు జగన్ ప్రకటించారు. అలాగే చంద్రబాబు- పవన్ కళ్యాణ్‌ను ఎలా ఎదుర్కోవాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు.

    వైస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    వైస్సార్ జిల్లా- ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్లదుర్తి వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో.. లారీని క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందినవారుగా గుర్తించారు.

    చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ

    చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    ఆలస్యమే మా స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

    తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉన్నామని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది మా పార్టీ ఇష్టం. నామినేషన్ చివరి రోజు వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు YSRTP పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పాలేరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరు సీటు కోసం ఆమె పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఖమ్మం ఎంపీ స్థానానని ఆఫర్ చేసింది. దీంతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ అయింది. ముందు నుంచి షర్మిల రాకను పీసీసీ … Read more

    డాడి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అనిండు: బాలకృష్ణ

    భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ క్రేజీ కామెంట్స్ చేశారు. “హీరోయిన్ శ్రీలీల చిచా, చిచా అని సినిమాలో టార్చర్ పెట్టింది. నాతో సినిమాలో నటించావ్ సరే. వచ్చే సినిమాలో ఇద్దరం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పా. ఇదే విషయం మా ఇంట్లో చెబితే.. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడి నెక్ట్స్‌ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తున్నావ్. ఏం డాడి నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అనిండు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. … Read more

    నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

    నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నిక ప్రక్రియను వివరించనుంది. కాగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది.

    నేడీ కీవీస్- నెదర్లాండ్ ఢీ

    వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఉప్పల్‌ వేదికగా కివీస్ – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్‌కు నెదర్లాండ్‌తో పోరు తేలికనే చెప్పవచ్చు. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ న్యూజిలాండ్ బలంగా ఉంది. అయితే పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్ గొప్పగా పోరాడింది.

    నేడు వైసీపీ ప్రతినిధుల సభ

    నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. 8,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తొలిసారి బార్ కోడింగ్ పాస్‌లను వైసీపీ జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 400 పెరిగి రూ. 53,150కి ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 440 పెరిగి 57,980కి పెరిగింది. అటు కిలో వెండి ధర రూ. 75 వేల వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. డిమాండ్ పెరగడంతో మళ్లీ పెరిగాయి.