• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణి కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి 199 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ(85), రాహుల్‌(97*) రాణించడంతో టీమిండియా విజయం సాధించిది. స్కోర్లు భారత్‌ 201/4, ఆస్ట్రేలియా 199 ఆలౌట్.

    తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,515 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,230 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసు ఐటెం నంబర్ 59గా లిస్టైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సేక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్‌ చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లాయర్లు వాదిస్తున్నారు.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    బిల్లా రంగాల్లా కేటీఆర్ హరీష్ దోపిడి: రేవంత్

    టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు బిల్లా రంగాలాగా రాష్ట్రమంతా తిరుగుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ద్వారా 10 వేల ఎకరాల భూమి కాజేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టుల జేబులు నింపేందుకే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ఇంకో రెండు నెలల్లో బీఆర్ఎస్ అధికారం ముగిసి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.

    వరంగల్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్

    భగవంత్ కేసరి ట్రైలర్ లాంచింగ్ వేదిక ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హీరో బాలకృష్ణ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 8న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. తండ్రి కూతుళ్ల అనుబంధమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావుపూడి తెరకెక్కిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది.

    మెలోడియస్‌గా… గాజు బొమ్మ సాంగ్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపేలా సాంగ్ సాగింది. ‘గాజు బొమ్మ’ సాంగ్ కంపోజింగ్ మెలోడియాస్‌గా ఉంది. కాగా ఈ సినిమాను డిఫరెంట్ స్టోరీతో శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

    చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వాయిదా

    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదివరకే చంద్రబాబును కస్టడీకి అప్పగించినందునా మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

    కేసీఆర్ ఓవైసీ కుటుంబానికి బానిస: కిషన్ రెడ్డి

    ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలి. మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ, ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లో పుట్టింది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్‌. కేసీఆర్‌ కూడా మహిళ వ్యతిరేకి. మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళ బిల్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్‌కు లేదు’ అని … Read more

    బాడీ గార్డుపై చేయి చేసుకున్న మంత్రి మహ్మద్ అలీ

    తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ తన బాడీ గార్డుపై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. బోకే ఇవ్వలేదంటూ బాడీ గార్డుపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://x.com/shinenewshyd/status/1710192290218869233?s=20