• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోంది: కారుమూరి

    ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ‘ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది అంటూ విమర్శలు గుప్పించారు.

    టీడీపీ నేతపై నటి ఖుష్బు తీవ్ర ఆగ్రహం

    మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. రోజాకు నా పూర్తి మద్దతు. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతా. రాజకీయ నాయకుడిగానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భం ఇది. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు … Read more

    ప్రారంభమైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే అల్పాహరం కార్యక్రమం లాంచనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 27వేల 147 పాఠశాలల్లో దాదాపు 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. స్కూలు టైమింగ్‌కు అర్ధగంట ముందు 1-10 వ తరగతి వరకు పిల్లలకు అల్పాహారం అందించనున్నారు.

    రూ.100 లంచం తప్పు కాదు: హైకోర్టు

    వంద రూపాయలు లంచం తీసుకోవడం తప్పు కాదంటూ బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించింది. పూణెలో వైద్యుడిగా పనిచేస్తున్న శిండే వద్దకు ఓ వ్యక్తి హెల్త్ సర్టిఫికేట్ కోసం రాగా రూ.100 డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. 2007లో నమోదైన ఈ కేసులో శిండేను నిర్దోషిగా పేర్కొంటూ 2012లో స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా రూ.100 లంచం తీసుకోవడం చిన్న విషయమంటూ కోర్టు తీర్పు చెప్పింది.

    టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు డెంగ్యూ

    ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌కు మందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నారని తెలుస్తోంది. గిల్‌కు ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్ కొనసాగిస్తున్న గిల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరం అయితే భారత్‌కు షాక్ అనే చెప్పాలి.

    ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం

    ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఏడంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

    లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 405 పాయింట్లు లాభంతో సెన్సెక్స్.. 65,361 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 59 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ 19,605 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.22 పైసల వద్ద కొనసాగుతోంది.

    ASIA GAMES: ఫైనల్ చేరిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో గెలచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేవలం 9.2 ఓవర్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40*, తిలక్ వర్మ 55* రాణించారు. నెపాల్‌పై సెంచరీ చేసిన యశస్వీ జైశ్వాల్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగాడు.

    లండన్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్ పర్యటనకు వెళ్లారు. ఆమె శుక్రవారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ‘మహిళా రిజర్వేషన్ చట్టం- ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అటుమ్ని సమావేశంలో కవిత పాల్గొంటారు.

    నేడు ‘సీఎం అల్పాహారం’ ప్రారంభం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు తీసుకువస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున ఈ రోజు ప్రారంభించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్థానంలో మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఉప్మా, కిచిడీ, పొంగల్, ఇడ్లీ, పూరీతో మెనూ సిద్ధం చేశారు.