• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 10న కాంగ్రెస్ జాబితా ఖరారు

    ఈ నెల 10న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 60 చోట్ల సింగిల్ అభ్యర్థి ఉండగా, 20 సెగ్మెంట్లలో ఇద్దరు చొప్పున.. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ, 9న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. 10న ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తుది జాబితా ఖరారు చేయనున్నారు.

    రూల్స్ రంజన్ ట్విట్టర్‌ రివ్యూ

    కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో వచ్చిన రూల్స్ రంజన్ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంది. లుక్స్, యాక్టింగ్ ఓకే. నేహశెట్టితో రొమాన్స్ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ కామెడీ లైనప్‌తో బాగుండి. సెకండాఫ్ పర్వాలేదు. సినిమాలో పాటలు బాగున్నాయి. సమ్మోహనుడా సాంగ్ థియేటర్లలో కేకలు పుట్టించింది అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

    తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉంది: సీఈసీ

    రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు – మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు’ అని పేర్కొన్నారు.

    నేడు నెదర్లాండ్‌తో పాకిస్థాన్ ఢీ

    ప్రపంచకప్‌ టోర్నీలో నేడు నెదర్లాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాగ్- ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. పాక్ ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. వరల్డ్ కప్ రెండు సన్నాహక మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై గెలిచి టోర్నీని ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఇక 2011 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్.. ఎలాంటి అద్భుతాలు చేయనుందో వేచి చూడాల్సి ఉంది.

    పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

    మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

    కేసీఆర్‌కు అధికారం తలకెక్కింది: కిషన్ రెడ్డి

    సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రధాని తెలంగాణకు వస్తే.. ఆయనను టూరిస్ట్‌ అనడమేంటి? కేంద్రం తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులను స్వాగతించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అధికారం తలకెక్కింది. కేటీఆర్‌ అభద్రతాభావంతో ఉన్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్‌లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంటుందిట’ అని చెప్పుకొచ్చారు.

    టాస్ గెలిచిన భారత్.. బంగ్లాతో సెమీస్

    ఆసియా గేమ్స్‌లో టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్లు బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, సైఫ్ హసన్(C), అఫీఫ్ హొస్సేన్, షాహదత్ హొస్సేన్, జాకర్ అలీ(w), రకీబుల్ హసన్, హసన్ మురాద్, మృత్తుంజోయ్ చౌదరి, రిపాన్ మొండోల్ భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(C), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ(w), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, … Read more

    ఎర్రబెల్లి ప్రేమతోనే కొట్టారు: MLA అంజయ్య

    మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన తల మీద కొట్టిన ఘటన మీద షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి తనను ప్రేమతోనే కొట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పెద్దస్థాయిలో అభివృద్ధి చేశావంటూ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన శిలాపలకం మీద ఉన్న నిధులు చూపిస్తూ తల మీద కొట్టారని చెప్పుకొచ్చారు. ఇటీవల షాద్‌నగర్ పర్యటనలో అంజయ్య యాదవ్‌ తలపై ఎర్రబెల్లి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు తల మీద కొట్టిన ఘటన మీద వివరణ ఇచ్చిన … Read more

    బిగ్‌బాస్ కీలక నిర్ణయం.. రతిక రీ ఎంట్రీ

    ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక రోజ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో హౌజ్‌లోకి వెళ్లిన 14 మందిలో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నలుగురు మహిళలను ఎలిమినేట్ చేయడంతో ముగ్గురు మిగిలారు. దీంతో జెంట్స్, లేడీస్ రేషియోలో బ్యాలెన్స్ తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్తగా మరో ఏడుగురు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో రతిక రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    తెలంగాణకు రాహుల్.. 3 రోజులు ఇక్కడే!

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల రెండో వారంలో తెలంగాణ రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే తుక్కుగూడ సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.