• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హాయ్ నాన్న’ నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. గాజు బొమ్మ.. నేనే నాన్న అంటూ సాంగ్ సాగింది. గాజు బొమ్మ పూర్తి పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈచిత్రానికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు. శౌర్యూవ్ డైరెక్ట్ చేశాడు. https://x.com/NameisNani/status/1709823205052133545?s=20

    భార్య, పిల్లల్ని చంపి కానిస్టేబుల్ సూసైడ్

    కడప – కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. అతని భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

    భారత్‌కు 20వ స్వర్ణం

    ఆసియా కప్‌లో భారత్ 20వ స్వర్ణాన్ని ముద్దాడింది. స్కాష్‌లో దీపికా పల్లికల్- హరిందర్ సంధు జోడీ మలేషీయా జంటపై విజయం సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 83కు పెరిగింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో ఓజాస్ ప్రవిణ్- అభిషేక్ ప్రథమేష్ జోడీ సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.

    సెన్సార్ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

    ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హీరో విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మార్క్ ఆంటోని చిత్రం సెన్సార్ కోసం రూ.7 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించిన సెన్సార్ బోర్డు.. ఇకపై సినిమా నిర్మాణ సంస్థలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

    టాస్‌ గెలిచిన న్యూజిలాండ్

    అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ తొలిమ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, మిచెల్ … Read more

    పెడనలో పవన్ ఫ్లాప్ షో: జోగి రమేష్

    పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. పెడనలో ప్రజల అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ‘సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశారు. రెండు వేల మందితో దాడులు అన్నారు. పవన్‌ సభకు రెండు వేల మంది కూడా రాలేదు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో. జనసేన-టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్’ అంటూ ఎద్దేవా చేశారు.

    ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వసూళ్ల వర్షం

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైనప్పటికీ యూఎస్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ లేటెస్ట్‌గా 1.825 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. ఈ మూవీని దర్శకుడు మహేశ్‌బాబు తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

    నటనపై ఆసక్తితో IAS అధికారి రాజీనామా

    సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికే ‘చార్ పండ్రా’ షార్ట్ ఫిలింతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఢిల్లీ క్రైమ్ సీజన్-2లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన అభిషేక్ ఓ వివాదంలో చిక్కుకుని సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

    రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రముఖ నగదు చెల్లింపుల సంస్థ పేటీఎం రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘న్యూ మనీ సేవింగ్’ పేరుతో తీసుకొచ్చిన ఆఫర్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. తత్కాల్‌తో పాటు అన్ని రిజర్వేషన్ టికెట్ల రద్దుపై పూర్తి రీఫండ్ పొందవచ్చని.. అందుకోసం కేవలం రూ.15 అదనంగా చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. రెలు టికెట్ల బుకింగ్స్ కోసం యూపీఐ చెల్లింపులు చేస్తే ఎలాంటి గేట్ వే ఫీజులు వసూలు చేయడం లేదని పేటీఎం వెల్లడించింది.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని మొత్తం 28 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 76,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 32,238 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకటేశ్వర స్వామీ హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.