• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల కమిటీలు ప్రకటించిన బీజేపీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీబీజేపీ సిద్ధమైంది. ఈమేరకు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేందుకు పార్టీ నేతలకు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. మొత్తం 14 కమిటీలు నియమించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతిని నియమించారు.

    టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే!

    వరల్డ్‌కప్‌లో టీమిండియా లీగ్‌ దశలో మొత్తం 9 టీమ్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో Oct 8న తలపడనుంది. రెండో మ్యాచ్ అఫ్గానిస్థాన్‌తో Oct 11న, పాకిస్థాన్‌తో 14న, బంగ్లాదేశ్‌తో 19న, న్యూజిలాండ్‌తో 22న, ఇంగ్లాంతో 29న, శ్రీలంకతో Nov 2న, సౌతాఫ్రికాతో Nov 5న, నెదర్లాండ్‌తో Nov 12న తలపడనుంది. మ్యాచ్ షెడ్యూల్ కార్డు కోసం Watch Onపై క్లిక్ చేయండి. https://x.com/Cricketracker/status/1709573479593574687?s=20

    సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

    వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికి వరకు 47 సెంచరీలు చేసిన కోహ్లీ ఇంకో మూడు సెంచరీలు చేస్తే.. వన్డేల్లో సచిన్(49) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. 269 ఇన్నింగ్సుల్లో విరాట్ 47 సెంచరీలు చేయగా.. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేశాడు. కోహ్లీ వరల్డ్‌ కప్‌లో ఒక్క క్యాచ్ పడితే భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పచ్చిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటికే కుంబ్లే అత్యధిక(14 … Read more

    సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది. డార్లింగ్ బర్త్‌డే కానుకగా అక్టోబర్ 23న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బసృర్‌ సంగీతం అందిస్తుండగా… హోంబళే పిక్చర్స్ సలార్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    వరుసగా మూడు రోజులు నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 327 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 65,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ సూచీ 19,526 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    నారా భువనేశ్వరి బస్సు యాత్ర?

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమైంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. కుప్పం నుంచి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆమెకు పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బస్సు యాత్ర తేదీ ఇంకా ఖరారు కాలేదు.

    బీఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ కీలక నేత

    బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ చేరనున్నారు. సాయంత్రం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కేటీఆర్‌తో ఫొన్‌లో మాట్లాడిన శ్రీధర్.. మైనంపల్లిని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

    ‘కేసీఆర్ కనిపించడం లేదు.. అతనిపైనే అనుమానం’

    బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించడం లేదు.. మాకు కేటీఆర్ పైనే అనుమానం ఉంద్నారు. కేసీఆర్ 15 రోజులుగా కనిపించడంలేదని.. తమకు ఏదో అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే ఆయన కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కేసీఆర్ గారితో ప్రెస్‌ మీట్ పెట్టించండి. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతాం’ అంటూ వ్యాఖ్యానించారు.

    నేడు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి

    మూడో రోజు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. ఈరోజు ఎన్నికల ప్రచారకర్తలతో సమావేశం నిర్వహించనుంది. దివ్యంగా ఓటర్ల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. పలువురు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి చేపట్టనుంది. నేడు ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

    ఇవాళ ముదినపల్లే నుంచి వారాహి యాత్ర

    నేడు విజయవాడ- ముదినేపల్లిలో పవన్ కల్యాణ్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లికి పవన్ చేరుకోనున్నారు. ముదినేపల్లిలో బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మాటల దాడి పెంచారు. 32 కేసులున్న జగన్ అవినీతిపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. సమస్యలపై గళం విప్పిన నేతలను జైలుకు పంపించి జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.