• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి జగన్ ఢిల్లీ టూర్

    నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    నేటి నుంచే వరల్డ్ కప్ సమరం

    నేటి నుంచి అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఫెవరెట్‌గా ఇంగ్లాండ్ కనిపిస్తోంది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. 2015, 2019 ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ మధ్నాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

    బీజేపీతో జనసేన పొత్తు లేనట్లేనా?

    పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నా తప్ప లేదు. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమతో జగన్‌ను పాతాళానికి తొక్కేయవచ్చు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని మద్దతు తెలిపా. ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు వస్తా. కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుంది” అని ఆశిస్తున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

    నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. మొదటి దఫాలో 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు చంద్రబాబుకు విధించింది. ఆతర్వాత దానిని అక్టోబర్ 5 వరకు పొడిగించింది. ఈరోజు మరోసారి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ జరగనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    రేవంత్ రెడ్డి ఇక జైలుకే: హరీష్ రావు

    ఓటుకు నోటుకు కేసులో త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి విచారణ ఆపాలని సుప్రీం కోర్టుకు పోతే కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఆ కేసు విచారణ అయ్యేది ఖాయం, రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు బిక్కమొహం వేస్తాయని పేర్కొన్నారు.

    బతుకమ్మ చీరల పంపిణీ షురూ

    తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. 25 రకాల డిజైన్‌లతో కోటి 20 లక్షల చీరలను పంపిణీకి సిద్ధం చేశారు. రేపటిలోగా అన్ని జిల్లా కేంద్రాలకు బతుకమ్మ చీరలు చేరనున్నాయి. అక్టోబర్ 10లోగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ మరమగ్గాల సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. గతేడాది బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.

    లిక్కర్‌ స్కామ్‌లో చిక్కిన మరో ఆప్ ఎంపీ

    ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఆప్ నేత చుట్టు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. దినేష్ అరోరా, మాగుంట రాఘవ అప్రూవర్‌లుగా మారిన గంటల వ్యవధిలోనే తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కస్టడీలో ఉన్న దినేష్ అరోరా.. ఎంపీ సంజయ్ సింగ్‌ను కలిసినట్టు ఈడీకి చెప్పడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఆప్ ఎన్నికల ఖర్చు కోసం లిక్కర్ స్కామ్‌ డబ్బును వినియోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

    డీసెంట్ వసూళ్లు రాబడుతున్న స్కంద

    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని కుర్ర హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. గతవారం రిలీజైన ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది. మొత్తం ఆరు రోజుల్లో స్కంద మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.23.68కోట్లు మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ వీకెండ్స్‌లోనూ పెద్ద సినిమాలు లేకపోవడంతో స్కంద కలెక్షన్లు పెరగనున్నాయి. కాగా ఈ చిత్రాన్ని బోయపాటి డైరెక్ట్ చేయగా.. థమన్ సంగీతం అందించాడు.

    తలపై గ్యాస్ సిలిండర్‌తో మహిళ డ్యాన్స్

    నెత్తిపై గ్యాస్ సిలిండర్‌ను పెట్టుకుని ఓ మహిళ డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ సిలిండర్‌ను తలపై పెట్టుకుని కొద్దిసేపు డ్యాన్య్ చేసిన ఆమె తిరిగి బిందెపై నిల్చుని కూడా కాసేపు స్టెప్పులేసింది. ఈ వీడియోను కొందరు ప్రశంసిస్తుండగా .. మరికొందరు ఇలాంటి వీడియోలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంత మంది మహిళలు ట్రై చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. https://www.instagram.com/reel/CxiEviFRnUE/?utm_source=ig_embed&ig_rid=1e05efce-eca6-4a93-8038-6a4d7f8c80f1

    చైనాకు చెెందిన 55 మంది సబ్‌మెరైన్లు మృతి!

    చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ఘోర ప్రమాదనికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 55 మంది సబ్‌మెరైన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా మౌనంగా ఉందని తెలిపింది. అమెరికా ఇంటలిజెన్స్ అప్పట్లోనే ఈ ప్రమాదం గురించి చెప్పినా డ్రాగన్ తోసిపుచ్చింది. తాజాగా బ్రిటన్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ప్రమాదం వార్తలకు బలం చేకూరాయి.