• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సామాజిక సందేశంతో రజినీ సినిమా

    తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170 వ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమా సామాజిక సందేశంతో తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుపాటి కీలక పాత్రల్లో నటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా హీరోయిన్లుగా రతికా సింగ్, మంజువారియర్, దుషారా విజయ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

    మేనిఫెస్టోపై కేసీఆర్ దృష్టి

    సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లకు ధీటుగా.. మహిళలు, రైతులే ప్రధానంగా హామీలు రూపొందిస్తున్నారు. రైతులకు ఉచిత ఎరువులు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు వంటి స్కీమ్స్‌ తీసుకొచ్చేందుకు అధికారులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

    పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మచిలిపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో కొంత మంది క్రిమినల్స్, అసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచిదికాదు. విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తే పర్యవసనాలు ఉంటాయి. మా సమాచార వ్యవస్థ మాకుంది. ఆయన దగ్గర ఏమైన ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి’ అని సూచించారు.

    పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

    రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం

    క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ సమరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈనెల 5 నుంచి నవంబర్ 19 వరకు టోర్నీ జరగనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ విధానంలో ఆడుతాయి. అంటే ఒక్కో జట్టు మిగతా 9 జట్లతో తలపడతాయి. లీగ్ దశ తర్వాత మొదటి 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

    ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

    ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈరోజు జరిగిన మిక్స్డ్ ఆర్చరీ ఈవేంట్‌లో భారత ఆటగాళ్లు జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజా గోల్డ్ మెడల్ సాధించారు. 5 కిలోమీటర్ల ట్రాక్ రేస్‌లో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి స్వర్ణం గెలిచింది. మరోవైపు 35మీ. మిక్స్డ్ వాక్ రేస్‌లో మజ్ను, రాంబాబు సిల్వర్ కొట్టారు. ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 71 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. వీటిలో 16 స్వర్ణాలు, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

    సచిన్‌కు అరుదైన గౌరవం

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5 నుంచి ఇండియాలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ప్రపంచకప్ టోర్నీతో కనిపించనున్నాడు. ఈనెల 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో అధికారికంగా టోర్నీ ఆరంభమవుతోంది. సచిన్‌తో పాటు గ్లోబల్ అంబాసిడర్లుగా ఇయాన్ మోర్గాన్, ఏబీ డివిలీయర్స్ ఇతర మాజీ క్రికెట్లను ఐసీసీ ప్రకటించింది.

    ఎన్నికల సన్నద్ధతపై వరుస భేటీలు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అధికారులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తోంది. వరుసగా రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం, మోడల్ కోడ్ అమలు వంటి వాటిపై సమాలోచనలు జరిపారు. కొందరు కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

    సిక్కింలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

    సిక్కింలోా ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు తీస్తా నది ఉగ్రరూపం దాల్సింది. నది ఉప్పొంగడంతో పెద్దఎత్తున వరదలు చోటు చేసుకున్నాయి. వరదల్లో పడి 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆర్మీ సిబ్బంది కోసం NDRF దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వరద తాకిడితో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. https://x.com/drmonika_langeh/status/1709415881183490117?s=20