• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇటలీలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి

    ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేనీస్ అందాలను చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. https://x.com/ChaudharyParvez/status/1709366955365585239?s=20

    నటి ఖుష్భుకు అరుదైన గౌరవం

    నటి ఖుష్బు అరుదైన గౌరవం దక్కించుకుంది. తిరుచూరులోని విష్ణు మాయ దేవాలయంలో ఏటా నిర్వహించే నారి పూజ కార్యక్రమంలో ఈసారి ఖుష్బు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమెకు అయ్యవార్లు ప్రత్యేక పూజలు చేశారు. విష్ణు మాయ ఆలయంలో పూజకు ఎంపిక కావడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఏటా కొంత మంది మహిళలను పూజ కోసం ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఖుష్బు తెలిపింది. ఈమేరకు ఫొటోలను షేర్ చేసింది.

    వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా

    బ్లూఫిల్మ్స్‌లో నటించిందంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. “సత్యానారాయణ చెప్పినట్లుగా వీడియోలు ఉంటే బయట పెట్టాలి. టీడీపీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డా. అక్కడ అవమానాలు ఎదుర్కోలేకే వైసీపీలో చేరా. జగన్, విజయమ్మలు కన్నకూతురిలా ఆదరించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ తన క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు”. మరోవైపు సత్యనారాయణ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. https://x.com/SumaTiyyaguraa/status/1709191945334174132?s=20

    దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులు ఖరారు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈసారి దసరాకు 13 రోజులు హాలీడేస్ వచ్చాయి. తెలంగాణలోనూ 13 రోజులు దసరాకు సెలవలు వచ్చాయి.

    నిజమై తప్పక ఉండి ఉంటది: విజయశాంతి

    ఎన్డీఏలో చేరుతానని తనతో కేసీఆర్ చెప్పారన్న మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ.. విజయశాంతి ఆయన వ్యాఖ్యలను సమర్థించింది. “ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు. నిజమై తప్పక ఉండి ఉంటది. 2009లో కూడా తెలంగాణలో మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానాలో ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకం ఉంది. కేటీఆర్ ఈ విషయంలో మోదీని తిట్టటం సరికాదు” అని చెప్పారు.

    ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్

    ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మోదీకి ఛాలెంజ్ చేస్తున్న.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్‌కు లేదు.. ఎన్డీఏలో చేరేందుకు మాకు పిచ్చి కుక్క కరవలేదు. మేం కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

    శ్రీవారి దర్శనానికి 10 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    భారీగా తగ్గిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ.52,600కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.660 తగ్గి రూ.57,380కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.2000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,200 వద్ద కొనసాగుతోంది.

    పోకిరిల తాట తీస్తున్న షీ టీమ్స్

    బహిరంగ ప్రదేశాలలో మహిళలను అసభ్యంగా తాకుతూ అమర్యాదగా ప్రవర్తిస్తున్న పోకిరిల ఆటకట్టిస్తున్నారు షీ టీమ్స్. ఇటీవల జరిగిన గణేష్ శోభాయాత్రలో మహిళలను వేధించిన 280 ఈవ్ టీజర్లను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన అసభ్య ప్రవర్తనను వీడియోల్లో రికార్డు చేశారు. ప్రతి ఒక్కరి ప్రవర్తనపై నిఘా ఉంటుందని మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు.

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.