• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.3శాతం: ప్రపంచ బ్యాంక్

    భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరంలో ఇండియా 6.3శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దేశంలోకి పెట్టుబడుల వరుస, స్థానిక డిమాండ్ వృద్ధిరేటుకు దోహం చేస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో దేశ ద్రవ్యోల్బణం 5.9శాతంగా ఉండబోతుందని అంచనా వేసింది.

    టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల

    మాస్ మహారాజ్‌ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో రవితేజ లుక్స్‌ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించారు. మాస్ లుక్‌లో రవితేజ అదరగొట్టాడు. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించింది. వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

    రెండో పెళ్లికి సిద్ధమైన నిహారిక మాజీ భర్త

    మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నల గడ్డ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిహారిక- చైతన్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ బాధను మరిచిపోయేందుకు విదేశాలకు వెళ్లిన చైతన్య తిరిగి వచ్చాడు. ఈక్రమంలో తల్లిదండ్రులు చైతన్యను పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య పెళ్లి కుదిరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    లండన్‌లో హైదరాబాది దారుణ హత్య

    లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్.. స్నేహితుడితో వెళ్తుండగా హత్య చేసి అతని వద్ద ఉన్న డబ్బు, వస్తువులను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. కుమార్తె పెళ్లి డబ్బుల కోసం గతేడాది రైసుద్దీన్ లండన్ వెళ్లాడు. ఇంటి దగ్గర పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. లండన్‌లో అన్ని పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలని ప్రభుత్వాన్ని … Read more

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

    చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వినిపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తీసుకునన నిర్ణయాలు అధికార నిర్వాహణలో భాగంగా తీసుకున్నవని కోర్టుకు వివరించారు. ఈ నిర్ణయాలకు 17(A) యాక్ట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష్యపూరితమైనవని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. నేరపూరితమై చర్యలకు 17(A) వర్తించదని కోర్టుకు విన్నవించారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి … Read more

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

    ప్రధాని మోదీ సభకు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహాబూబ్‌నగర్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరు కాలేదు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఇరువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈరోజు ప్రధాని మోదీ నిజమాబాద్ సభకు రానున్నారు. మరి ఈ సభకైన విజయశాంతి, కోమటిరెడ్డి హాజరవుతారో లేదో చూడాలి.

    పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

    ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ

    అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని ఉమ ఇతర టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారించిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

    మోదీ గారు మా 3 హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. “మా 3 ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ 3 విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు, తెలంగాణ గోస తీరేదెప్పుడు? “అని ప్రశ్నించారు.

    ప్రభాస్ చెంప మీద కొట్టిన యువతి

    ప్రభాస్‌ను ఓ యువతి చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ను గుర్తించిన యువతి సెల్ఫీ కోసం డార్లింగ్ దగ్గరకు వెళ్తుంది. ప్రభాస్‌తో ఫొటో దిగిన ఆనందంలో ఆ యువతి డార్లింగ్ చెంపపై చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. ఈవీడియో సాహో టైంలో జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again