• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్లు

    కాంగ్రెస్ పార్టీలో YSR తెలంగాణ పార్టీ విలీనం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం రెండు బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు, ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్‌ను ప్రతిపాదించింది. అయితే పాలేరు అసెంబ్లీ సీటును షర్మిల ఆశిస్తుండగా.. అధిష్ఠానం కుదరదని చెప్పినట్లు టాక్. ఈరోజు లేదా రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో ఆమె భేటీ కానుంది.

    ‘మ్యాడ్’ ట్రైలర్ విడుదల చేసిన జూ.ఎన్టీఆర్

    జూ.ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం మ్యాడ్. ఈ ట్రైలర్‌ను జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల జీవితాల మధ్య జరిగే సరదా సంఘటనలు సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. బీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

    ఈనెల 6న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 6 లేదా 7 వ తేదీన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10న విడుదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వరుస భేటీలతో ఎన్నికల సన్నద్ధతను పరిశీలిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్… సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలను కలిసి అభిప్రాయాలను కోరారు. తెలంగాణ అసెబ్లీ పదవి కాలం డిసెంబర్‌తో ముగియనుంది.

    నేపాల్‌పై భారత్ ఘన విజయం

    ఆసియాకప్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసిన నేపాల్ గొప్ప పోరాటం చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ 32, సందీప్ జోరా 29 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. నేపాల్ స్కోరు 179/9, ఇండియా స్కోరు 202/4.

    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ 65,156 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,533 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఏషియన్ పేయింట్ల్, బజాజ్ ఫైనాన్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షెర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగింది. రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

    బిహార్‌లో బీసీలే అధికం

    బిహార్ కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల ప్రకారం బిహార్ మొత్తం జనాభాలో 63.13శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. వీరి సంఖ్య 13.07 కోట్లు. ఇక దళితులు 19.65%, అత్యంత వెనకబడిన వారు 36శాతం, యాదవులు 14.27శాతం, ఇతర వెనకబడిన కులాల వారు 27శాతం మంది ఉన్నారు. అటు హిందువులు 81.99శాతం ఉండగా.. ముస్లింలు 17.7శాతం ఉన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిరాకరించడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టారు.

    రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట

    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఫ్యాన్సి నంబర్ల వేలం.. కాసుల వర్షం కురిపిస్తోంది. రంగారెడ్డి, మెడ్చల్, హైదరాబాద్‌లో గత నెల నంబర్ల వేలం ద్వారా రూ.38.48 కోట్ల ఆదాయం ఆర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 0009, 007, 9999, 0001 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 0009 నంబర్‌ను రూ.10.5 లక్షలకు ఆన్‌లైన్‌ వేలంలో గెలుపొందాడు. అలాగే 9999 నంబర్‌కు రూ.21 లక్షలు ధర పలికినట్లు చెప్పారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ఈ కేసును విచారించనుంది. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై సీఐడీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఐటం నంబర్ 63 కింద లిస్ట్ చేసింది. అటు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరశన దీక్షలు కొనసాగుతున్నాయి.

    భారీ స్కోరు చేసిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో పసికూన నేపాల్‌కు టీమిండియా భారీ టార్గెట్ విధించింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్ 15 బంతుల్లో 37 పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3 వికెట్లు, సోంపాల్ కామి ఒక వికెట్ పడగొట్టారు.

    స్వల్పంగా తగ్గిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.53,200కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 160 తగ్గి రూ.58,040కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.