• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు వస్తారా?: హరీష్

    బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనపై చర్చకు పెడుదామా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హరీష్ రావు సవాలు విసిరారు. కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకి కాంగ్రెస్ పాలనపై చర్చ పెడుదాం అంటున్నాడు. సోనియాగాంధీని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నాడు అని విమర్శించారు.

    మళ్లీ కేసీఆర్‌దే అధికారం: టైమ్స్ నౌ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చేపట్టిన ప్రీ పోల్స్ ఫలితాలను టైమ్స్‌ నౌ వెల్లడించింది. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, బీజేపీలు దరిదాపుల్లో సైతం లేవని తేల్చి చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే మరో రెండు స్థానాలు ఎక్కువ సాధించే అవకాశం ఉందని చెప్పిన టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.

    నారాయణకు మరోసారి నోటీసులు

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నారాయణను విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్‌ను ఇటీవల ఏ14గా చేరుస్తూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    మహాత్మునికి సీఎం జగన్ నివాళి

    గాంధీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. గ్రామ/వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామన్నారు. మునుముందు కూడా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాం అని పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాల సాధనగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.

    పవన్ పూటకో మాట: అంబటి

    అవినీతిలో మునిగి తేలినవాళ్లు జైళ్లో మహాత్మగాంధీ జయంతి రోజున దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి దీక్షలు చేస్తున్నవారిని చూస్తే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాక బీజేపీతో పొత్తు అని ఇప్పుడు టీడీపీతో మాత్రమే పొత్తు అని అంటున్నారని చురకలు అంటించారు. కేవలం కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.

    రీ రిలీజ్‌కు సిద్ధమైన అదుర్స్

    యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, వి.వి. వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్. ఈచిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. జూ. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, షీలాలు హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ సంగీతం అందించారు. కోడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

    ప్రధాని మోదీ ఘన నివాళి

    గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. యావత్ ప్రపంచంపై బాపూజి చెరగని ముద్ర వేశారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన కలల్ని నిజం చేసుకుందాం. ఐకమత్యాన్ని, సామరస్యతను చాటుకుందాం అంటూ సందేశం ఇచ్చారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు గాంధీజికి నివాళులు అర్పించారు.

    14న సడక్ బంద్‌కు పిలుపు

    ఉద్యోగాల నియామకాల విషయంలో TSPSC వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల మనోవ్యథకు కారణమైన TSPSC తీరును నిరసిస్తూ ఈనెల 14న సడక్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి నిరసన చేపట్టాలని సూచించారు. ఈ సడక్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష సరిగా నిర్వహించలేదని హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

    Bigboss7: రతిక రోజ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

    బిగ్‌బాస్ సీజన్ 7 బ్యూటీ రతిక రోజ్ నాల్గో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్న రతిక గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. వారానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు పొందినట్లు టాక్. తొలుత బిగ్‌బాస్ టైటిల్ ఫెవరెట్‌లలో ఒకరిగా నిలిచిన రతిక ఆ తర్వాత.. పల్లవి ప్రశాంత్, యావర్‌తో నడిపిన ట్రాక్‌లు వర్కౌట్ కాలేదు. వారిని బ్యాక్ బిచింగ్ చేయడం ఆమెపై నెగిటివిటిని పెంచింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.