• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హరిహరవీరమల్లు ఇప్పట్లో లేనట్లేనా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ నవంబర్‌లో కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ వరకు డేట్స్ కుదరకపోవచ్చని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో AM రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

    యువకుడి పొట్టలో గర్భాశయం

    ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడి పొట్టలో గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. యువకుడి తల్లిదండ్రుల అనుమతితో గర్భాశయాన్ని తొలగించారు. కొద్దిరోజులుగా యువకుడు నిరంతరం కడుపునొప్పితో బాధపడుతుండే వాడు. కాళ్లు కూడా వాపునకు గురయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అతనిలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 300వరకు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    జగదీశ్వర్‌రెడ్డికి డిపాజిట్ దక్కదు: కోమటి రెడ్డి

    సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా అని సవాలు విసిరారు. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో జగదీశ్వర్ రెడ్డి గట్టెక్కారని గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆరోపించారు.

    వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది: సమంత

    హీరోయిన్ సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెనీస్ వెకెషన్‌లో ఉన్న సామ్.. అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈమేరకు.. ‘నిరీక్షించే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతుంటాయి’ అనే క్యాప్షన్‌ను కోట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇటీవల అమెరికాలో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత కొలుకున్నట్లు తెలిసింది. మానసికంగా బలంగా ఉండేందుకు.. టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు జైలులో చంద్రబాబు దీక్ష

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఈరోజు నిరశన దీక్ష చేపట్టనున్నారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు రాజమండ్రి క్వారి సెంటర్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.

    భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ట్రైలర్ అక్టోబర్ 8న రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.

    ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్

    ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే పదిలంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మోదీ మార్చారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

    కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతం: మోదీ

    తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ‘పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మరో పార్టీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉంది. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది అని చెప్పుకొచ్చారు.