• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి: పవన్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. నాల్గో విడత వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్ధత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు … Read more

    వారాహి యాత్రపై పేర్నినాని విమర్శలు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ యాత్ర కేవలం కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమ్మ, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన టైంలో పవన్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు.

    తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు

    తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిజామాబాద్, ఆదిలాబాద్ రైతుల కలను నిజం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.900కోట్లతో ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీగా నామకారణం చేస్తున్నట్లు వెల్లడించారు. మహాబూబ్ నగర్‌లో ఉన్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. https://x.com/TeluguScribe/status/1708422922199826539?s=20

    వాల్తేరు వీరయ్య టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్

    మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ టెలివిజన్ ప్రిమియర్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా దసర పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

    తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్ బైయాన్‌పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను బుట్టల్లోకి ఎత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. https://x.com/narendramodi/status/1708383866711642496?s=20

    భగవంత్ కేసరి నుంచి రెండో సాంగ్

    బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్ విడుదల తేదీ ఫిక్సైంది. అక్టోబర్ 4న ఉయ్యాలో ఉయ్యాలో అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ రావుపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సన్‌ షైన్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

    కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

    మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు.. మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మనస్తాపం చెందారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల అలకబూనారు. అధిష్ఠానంతో చర్చించాక కూడా హామీ దక్కకపోవడంతో తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

    ప్రధాని టూర్‌కు కేసీఆర్ డుమ్మా

    ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌కు సీఎం కేసీఆర్ మరోసారి ఎగ్గొట్టారు. ఈసారి కూడా ప్రధానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. ప్రధానికి ఎక్కువసార్లు స్వాగతం పలికిన మంత్రిగా తలసాని రికార్డు సృష్టించనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భందా హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మోదీని రావణాసురిడితో పోలుస్తున్న పోస్టర్ల పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    అంగన్‌వాడి టీచర్లపై వరాల జల్లు

    అంగన్‌వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్‌వాడీలను చేర్చాలని నిర్ణయించింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కేసీఆర్ సర్కారు విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా జీతాలు పెంచాలని అంగన్‌వాడి టీచర్లు ధర్నా చేస్తున్న సంగతి తెసిందే. గౌరవ వేతనం రూ.15 వేలను డబుల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా నిర్ణయంపై అంగన్‌వాడి టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ విడుదల

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి రేణు దేశాయ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రేణు.. హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నారు. ఈమేరకు ఆమె పేరుతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. మరి చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్న రేణు దేశాయ్.. సినిమాలో ఎలాంటి పాత్ర చేయనున్నదో అని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నారు.