• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BIGBOSS7: రతిక రోజ్ ఎలిమినేట్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో నాలుగోవారం నామినేషన్లలో భాగంగా రతిక రోజ్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. నామినేషన్‌లో తేజ, యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపి.. ఆ తర్వాత అతన్ని చులకనగా మాట్లాడటం, తొలినుంచి సపోర్ట్ చేస్తున్న శివాజికి వెన్నుపోటు పొడవటం వంటివి ఆమె నెగిటివిటిని పెంచాయి. దీంతో రతిక నాల్గోవారం ఎలిమినేట్ అయింది.

    గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

    ఆసియా గేమ్స్‌- గోల్ఫ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున తొలిసారి పతకం సాధించిన క్రీడాకారిణిగా అదితి నిలిచింది. మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో జోవార్ సింగ్, చెనాయ్, పృథ్వీరాజ్‌తో కూడిన టీమ్ గోల్డ్ గెలిచింది. మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రాజేశ్వరి, మనీషా, ప్రీతి బృందం సిల్వర్ మెడల్ కొట్టింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. వీటిలో 11 గోల్డ్ మెడల్స్, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. Screengrab … Read more

    ఘోస్ట్ ట్రైలర్ విడుదల

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. యుద్ధం ప్రపంచ మానవాళికి మాయని గాయం.. యుద్ధం వల్ల సామ్రాజ్యాల స్థాపన కంటే విధ్వంసమే ఎక్కువ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. శివరాజ్ కుమార్ మాస్ లుక్ బాగుంది. పొరాట సన్నివేశాలు చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్‌తో పాటు విజయ్ సేతుపతి, జయ్‌రామ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను MG శ్రీనివాస్ డైరెక్ట్ … Read more

    అరసవల్లి స్వామిని తాకని సూర్య కిరణాలు

    అరసవల్లి స్వామిని తాకని సూర్యకిరణాలు ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం సూర్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఏటా అక్టోబర్ 1న సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని మూల విరాట్‌ను తాకుతాయి. అయితే ఈసారి ఆ అద్భుతం ఆవిష్కృతం కాలేదు. రాత్రి నుంచి చిరుజల్లులు, మబ్బులు కారణంగా సూర్యకిరణాలు ప్రసరించలేదు. దీంతో నిరాశతో భక్తులు వెనుదిరుగుతున్నారు. సోమవారం సూర్యకిరణాలు పడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకే సమయంలో దర్శించుకుంటే పుణ్యమని భక్తులు భావిస్తారు.

    ప్రధాని మోదీ పోస్టర్ల కలకలం

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ హైదరాబాద్‌లో పలుచోట్ల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో జరిగిన అన్యాయంపై ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ మీద మోదీది సవతితల్లి ప్రేమ అంటూ విమర్శలు పోస్టర్లలో వెలిశాయి. ఈ పోస్టర్లను కావాలనే బీఆర్ఎస్ నేతలు అంటించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    పాక్‌ను చిత్తు చేసిన భారత్

    ఆసియా గేమ్స్‌- హాకీలో పాకిస్తాన్‌పై 10-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాక్‌ను చిత్తు చేశారడు. తాజా విజయంతో గ్రూప్‌ ఏలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 216 పతకాలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి కల్యాణవేదిక వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 41,575 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ఈరోజు, రేపు వర్షాలు

    వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈరోజు రేపు హైదరాబాద్ సహా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు అంచనా వేసింది.

    ఓటీటీలోకి ‘ఖుషి’

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. సామ్- విజయ్‌లు ఈ సినిమా ద్వారా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. థియేటర్లలో మిస్‌ అయినవారు ఓటీటీలో చూడవచ్చు. ఇక ఈ సినిమాకు అబ్దుల్ వహద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

    తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి: నామా

    సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో రాజ్యసభ సభ్యుడు నామ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి. భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని పార్లమెంట్‌లో రైతుల పక్షాన పోరాడాలి అని కేసీఆర్ నాకు ప్రతిసారి చేప్పేవారు. గతంలో అప్పులు ఆత్మహత్యలు జరిగేవి. పోరాడి సాధించుకున్న తరువాత తెలంగాణలో రైతన్నకు పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.