అరసవల్లి స్వామిని తాకని సూర్యకిరణాలు
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం సూర్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఏటా అక్టోబర్ 1న సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని మూల విరాట్‌ను తాకుతాయి. అయితే ఈసారి ఆ అద్భుతం ఆవిష్కృతం కాలేదు. రాత్రి నుంచి చిరుజల్లులు, మబ్బులు కారణంగా సూర్యకిరణాలు ప్రసరించలేదు. దీంతో నిరాశతో భక్తులు వెనుదిరుగుతున్నారు. సోమవారం సూర్యకిరణాలు పడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకే సమయంలో దర్శించుకుంటే పుణ్యమని భక్తులు భావిస్తారు.