సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇక్కడి సినిమాలపై రీల్స్ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్ క్రికెటర్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. టాలీవుడ్ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చీరకట్టులో అందాల జాతర
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. ఓ వైపు క్రికెట్.. మరోవైపు పాటల ఆల్బమ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్.. యంగ్ హీరోయిన్ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్‌చల్ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ..
బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
నెట్టింట హాట్ ట్రీట్
యంగ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూ వారిని ఎంటర్‌టైన్ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.